తెల్ల జెండా..పచ్చ మొక్క …రామోజీ

0
740

ram1
ఈనాడు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మొత్తం ప్రాంతీయ భాషా పత్రికల్లో ఓ సంచలనం ..గడిచిన నలభై ఏళ్లలో కొన్ని పత్రికలు దానికి పోటీ ఇచ్చి ఉండొచ్చు ..కానీ ఒక్క పత్రిక కూడా దాని కన్నా పై చేయి సాధించలేకపోయింది .ఇందుకు ఎవరెన్ని కారణాలు చెప్పినా …ఎవ్వరూ కాదనలేనిది ఈనాడు అధినేత రామోజీ కృషి,పోరాట శైలి ..తెలుగుదేశం పార్టీ పుట్టాక ,అంతమందు కూడా ఆయన కాంగ్రెస్ వ్యతిరేకత ఈనాడు లో కనిపించేది .తెలుగు దేశం తొలిసారి ఎన్నికల బరిలోకి దిగినప్పుడు ఈనాడు ఎడిటోరియల్ నేరుగా ఎన్ఠీఆర్ కి మద్దతివ్వమని ప్రజల్ని కోరింది .ఫలితాలు రాగానే ,ఇకపై ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అదే ఎడిటోరియల్ లో చెప్పింది .ఇంత తెగువ చూపిన పత్రికాధిపతులు చాలా తక్కువ .అయితే ఆ దూకుడే ఈనాడుని ప్రజలకి దగ్గర చేసింది .

ntr_img13

chandrababu-ramojirao-6తర్వాత కాలంలో ఎన్ఠీఆర్ కి రామోజీ కి దూరం పెరిగింది .లక్ష్మీ పార్వతి వచ్చాక ఈనాడు ఆయన వ్యవహార శైలిపై అదే దూకుడు ప్రదర్శించింది .ఇక చంద్రబాబు అధికారం లోకి వచ్చాక ఈనాడు లో వాడి వేడి కాస్త తగ్గాయి .ప్రభుత్వం బదులు అవినీతి అధికారులు వారి టార్గెట్ అయ్యారు .రాజశేఖర రెడ్డి అధికారం లోకి వచ్చాక మళ్ళీ ఈనాడు పాత పంధా లో చెలరేగిపోయింది .అయితే ఈ సారి పోరాటం అంత తేలిక కాలేదు.వై.ఎస్ ఎదురుదాడితో ఈనాడు,మార్గదర్శి ఎదుర్కొన్న సమస్యలు అన్ని ఇన్ని కావు .వై .ఎస్ మరణం తో రామోజీ కుదురుకున్నారు .

etvsuman1347015749

ram modiకుమారుడు సుమన్ మరణం తో రామోజీ వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చింది .తెలంగాణ ఉద్యమ సమయం లో ఆ పత్రిక సంయమనం తో నడిచింది .2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీకూటమి విజయం లో ఈనాడు కీలక పాత్ర పోషించింది .ఫలితం వచ్చాక ఈనాడు ,ముఖ్యం గా రామోజీ తీరులో అనూహ్య మార్పు కనిపిస్తోంది .ఒకప్పుడు ఎంతటి వారినైనా డీ కొట్టే ధోరణి పూర్తిగా మారిపోయింది .అటు కేంద్రంలో మోడీ సర్కార్ కు పూర్తి స్థాయిలో ,ఇటు ఏపీ లో టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తోంది .వివాదాస్పద అంశాలు ముట్టుకోవడం లేదు .ఇంత కన్నా ఆశ్యర్యకరం అటు తెలంగాణ లో కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకం గా వార్తలు కనపడడం లేదు .ఒకప్పుడు తనని ముప్పు తిప్పలు పెట్టిన వై .ఎస్ కుమారుడు జగన్ తో కూడా ఆయన సమావేశం అయ్యారు .

Jagan-ramoji

Kcr_Ramoji-raoఒకప్పుడు ఎంత పెద్ద వాళ్ళైనా ఆయన దగ్గరకే వచ్చేవాళ్ళు ..రామోజీ బయటకి రావడం బహు అరుదు .కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వాలు ఇచ్చిన ప్రతి పిలుపుకి స్పందిస్తున్నారు .స్వస్వచ్ఛ్ భారత్ సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ..మోడీ పిలుపే కాదు కేసీఆర్ ఇచ్చిన హరిత హారం కి కూడా ఆయన స్పందించారు .,పచ్చని మొక్కలు నాటడంలో ముందున్నారు ..ఇదంతా బాగానే ఉంది ..ప్రభుత్వ విధానాలతో దెబ్బ తింటున్న వాళ్ళ పక్షాన పోరాడే ఓ గళం మౌనం దాల్చడం ఎందరినో నిరాశకు గురి చేస్తోంది .పోరాట వీరులు తెల్ల జెండా ఎత్తడం వారికి నచ్చడం లేదు .ఇది ఈనాడు కి మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు మొత్తం తెలుగు మీడియా నే శ్వేతవర్ణపు జెండా చేతిలో పెట్టుకు తిరిగే రోజులొచ్చాయి . వాళ్ళందరి కన్నా రామోజీ భిన్నం అనుకునే వాళ్ళకే ఈ చేదు నిజం జీర్ణం కావడం లేదు

Leave a Reply