అప్పటినుండి చరణ్, బన్నిలను దూరం పెట్టాడట..!

0
308
Rana About Mega Hero's Ram Charan And Bunny

Rana About Mega Hero's Ram Charan And Bunnyఇప్పుడు స్టార్ హీరోలుగా సూపర్ క్రేజ్ సంపాదించిన రాం చరణ్, అల్లు అర్జున్, రానాలు చిన్న నాటి నుండి మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. చిన్ననాటి నుండి వారి ముగ్గురు మంచి రిలేషన్ మెయింటైన్ చేశారట. రానా అయితే చెర్రి, బన్నిలకు అర్ధ రాత్రి అపరాత్రి అని కూడా చూడకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేసి మాట్లాడే వాడట. అయితే సడెన్ గా వారిద్దరితో ఫోన్ సంభాషణలు కట్ చేసాడట రానా. ఎందుకు అంటే ఇద్దరికి మ్యారేజ్ అయ్యిందన్న కారణం చేత అని అంటున్నాడు. వారు పెళ్లి చేసుకుంటున్నారు అన్న ఆలోచన రాగానే తనకు పెళ్లి మీద ద్యాస మళ్లిందని.

కాకపోతే తనకు నచ్చే అమ్మాయి దొరకలేదని అంటున్నాడు రానా. పెళ్లికి ముందు ఏ టైంలో చేసినా ఓకే కాని పెళ్లి తర్వాత వారు ఫ్రీ అయినప్పుడు చేస్తే తప్ప తాను వారిని డిస్ట్రబ్ చేయదలచుకోకనే వారికి దూరమయ్యానని అంటున్నాడు రానా. సో మొత్తానికి చెర్రి, బన్నిల పెళ్లి రానాతో స్నేహానికి దూరం చేసిందన్నమాట. అయితే ఫోన్ లో మాట్లాడకున్నా ఏదైనా ఫంక్షన్ లో కలిస్తే మాత్రం లోకాన్ని సైతం మర్చిపోయి మరి ముచ్చట్లాడుతాం అని అన్నాడు రానా. స్టార్స్ గా ఓ ఇమేజ్ వచ్చాక ఫోన్ లో మాట్లాడే టైం ఎక్కడుంటుంది చెప్పండి. చెర్రి, బన్ని టాలీవుడ్ మాత్రమే ఏలేస్తుంటే రానా స్పెషల్ క్రేజ్ తో హిందిలో కూడా సత్తా చాటుతున్నాడు.

Leave a Reply