మరో చారిత్రాత్మక చిత్రంలో రానా ?

 Posted October 18, 2016

rana again act mythological movie

చారిత్రక నేపథ్యం ఉండే చిత్రాలంటే భల్లాదేవ (రానా దగ్గుపాటి)కి భలే ఇష్టమట. ఆయన అభిరుచికి తగ్గట్టుగానే ఇప్పటికే రెండు చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించారు. బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు రానాకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక, వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానున్న బాహుబలి అంతకుమించి పేరు తెస్తుందనే నమ్మకంతో ఉన్నాడు ఈ దగ్గుపాటి హీరో.

ఇటీవలే ‘బాహుబలి 2’ షూటింగ్ ని పూర్తి చేసుకొన్న రానా బాలీవుడ్ చిత్రం ‘ఘాజీ’తో పాటుగా.. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్ర షూటింగ్ లో
పాల్గొంటూ బిజి బిజీగా గడుపుతున్నాడు. అయితే, తాజా సమాచారమ్ ప్రకారం రానా మరో చారిత్రాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇది స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథ. ఇందులో రానా ఓ సైనికుడిగా కనిపించనున్నారట. తమిళ, తెలుగు భాషల్లో సినిమా తెరకెక్కనుంది. రానా సరసన రెజీనా జతకట్టనుంది. దర్శకుడు ఎవరు ? మిగతా చిత్ర విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి. మొత్తంగా చూస్తుంటే.. వీలైనన్ని చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలని చేయాలని రానా పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది.

SHARE