అక్కడ తెలుగు యువ హీరోల యుద్ధం ..

0
375
rana allu sirish fights in rana ghazi movie and allu sirish 1971 beyond borders movie

Posted [relativedate]

rana allu sirish fights in rana ghazi movie and allu sirish 1971 beyond borders movie
చారిత్రక సినిమాలకి ఒక్కసారిగా ఊపొచ్చింది.కొన్నేళ్లుగా బాలీవుడ్ ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నా దక్షిణాది జనాలకి ఎక్కడో సందేహం..అడపాదడపా వస్తున్న సినిమాలు విజయవంతమవుతున్నా పూర్తి నమ్మకం కుదరడానికి టైం పట్టింది.గౌతమి పుత్ర శాతకర్ణి విజయం తర్వాత మరింత ఉత్సాహంగా చారిత్రక సినిమాల వైపు అడుగు వేస్తున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఆ కోవలోనే ఇప్పుడు ఇద్దరు తెలుగు యువ హీరోలు ఒకే యుద్ధ నేపధ్యమున్న వేర్వేరు సినిమాలు చేస్తున్నారు.ఒక దాంట్లో రానా హీరో అయితే ఇంకోదాంట్లో శిరీష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.అయితే ఈ రెండు సినిమాలు డబ్బింగ్ అయ్యి తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తాయి గానీ …నేరుగా తీస్తున్నవి కాదు.రానా హీరోగా వస్తోంది హిందీ సినిమా అయితే,శిరీష్ ముఖ్య పాత్ర పోషిస్తోంది మళయాళ మూవీ లో .

1971 లో భారత్,పాక్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఒకేసారి రెండు భాషల్లో వేర్వేరు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి.సముద్ర యుద్ధంలో పాక్ జలాంతర్గామి ఘాజీ ని ఫినిష్ చేసే వృత్తాంతంతో అదే పేరుతో తీస్తున్న సినిమాలో రానా హీరోగా చేస్తున్నాడు.తెలుగబ్బాయి సంకల్ప్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.ఇక ఇదే యుద్ధం సరిహద్దుల్లో లో జరిగిన కథతో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా 1971 బియాండ్ బోర్డర్స్ అనే పేరుతో తీస్తున్నారు. ఈ మలయాళ మూవీ లో యువ హీరో శిరీష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఏదేమైనా అరభాషలో తెలుగు హీరోలు ఒకరు నీటిలో ..ఇంకోరు నేలపై ఒకే యుద్ధం చేయడం ఆసక్తికరమే.

Leave a Reply