ఎమ్మెల్యే గా రానా?

0
301
rana as mla in teja direction

Posted [relativedate]

rana as mla in teja direction
ముఖ్యమంత్రి పాత్రలో లీడర్ తో కెరీర్ మొదలెట్టిన రానా ఇప్పుడు ఎమ్మెల్యే అవుతున్నాడు.తండ్రి సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు తేజ .నేనే రాజు ..నేనే మంత్రి అనే టైటిల్ తో సాగే ఈ చిత్రంలో రానా ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించి విడుదలైన ఓ పోస్టర్ తో రానా పాత్ర గురించి స్పష్టత వచ్చింది.ప్రేమ కథా చిత్రాలు తీయడంలో మేటి అయిన తేజ ఫామ్ కోల్పోయి చాలా రోజులైంది .అయితే ఈసారి అయన చెప్పిన కధ సురేష్ బాబు ,రానా లని బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.ఈ సినిమా కధ ప్రకారం ఎమ్మెల్యేగా గెలిచే హీరో మంత్రి కూడా అవుతాడట.

పేరుకి ఎమ్మెల్యే పాత్ర అయినా రోల్ మాస్ గా ఉంటుందని చిత్ర యూనిట్ నుంచి వస్తున్న లీక్. ట్రెండ్ కి భిన్నంగా ప్రయత్నించే రానా ఈ చిత్ర కధ గురించి తెలిసిన వాళ్ళందరి దగ్గర గొప్పగా చెబుతున్నాడట.ఇక మనసుకి ఏదనిపిస్తే అదే మాట్లాడే దర్శకుడు తేజ ఈసారి ఈ సినిమా గురించి బయటికి మాట్లాడ్డం లేదు .సినిమాతోనే మాట్లాడించాలని …నేనే రాజు నేనే మంత్రి తో పూర్వవైభవం సాధించాలని పట్టుదలగా వున్నారని వినికిడి .మొత్తానికి చాన్నాళ్ల తర్వాత రానా ,తేజ చొరవతో తెలుగు ప్రేక్షకులు ఓ పొలిటికల్ డ్రామా చూడబోతున్నారు.

Leave a Reply