‘బాహుబలి2లో రానా కటౌట్’ అదిరిరింది….

Posted October 4, 2016

 rana body excellent bahubali 2 movie
బాహుబలి ఫీవర్ మళ్లీ మొదలైంది. ఇటీవలే బాహుబలి టీం మీడియా ముందుకు వచ్చి.. బాహుబలి2 చిత్ర విశేషాలని పంచుకొన్న విషయం తెలిసిందే. తాజాగా, ‘బాహుబలి 2’ కోసం భల్లాల దేవ (రానా) ఏ రేంజ్ లో కసరత్తు చేశాడో ఓ లుక్కు వదిలింది బాహుబలి చిత్రబృందం. ఈ పిక్ లో రానా లుక్ హాలివుడ్ రేంజ్ లో ఉంది.  తన ట్రైనర్ తో కలిసి జిమ్ లో ఫోజ్ ఇచ్చిన రానా, ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ కు పోటీ ఇచ్చే స్థాయిలో కండలు పెంచేశాడు కండలు తిరిగిన రానా
కటౌట్ ను చూస్తే వారెవ్వా అనాల్సిందే. ‘బాహుబలి2లో రానా కటౌట్ పై… మీరు ఓ లుక్కేయండీ..  

ఇదిలావుండగా.. ‘బాహుబలి’లో భల్లాదేవ వీరత్వం చూపించే సన్నివేశాలు ఒకట్రెండు మాత్రమే ఉన్నాయ్. కానీ, బాహుబలి2లో భల్లాదేవ-బాహుబలి లు నేరుగా తలపడనున్నారు. ఆ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయట. ఇందుకోసం. రానా, ప్రభాస్ భారీ కసరత్తులు చేసినట్టు బాహుబలి చిత్రబృందం చెబుతోంది. ఇందుకోసం రానా ఏకంగా 110 కిలోకు బరువు పెరిగాడు. రానాతో పాటుగా ప్రభాస్ కూడా ఇదే స్థాయిలో కండలు పెంచేశాడు. బాహుబలి2లోని ప్రభాస్ కటౌట్ కూడా త్వరలోనే రిలీవ్ కానుంది. అప్పటి వరకు బాహుబలి అభిమానులు భల్లాదేవుడి కటౌట్ ని మురిసిపోవాల్సిందే.

 
 
SHARE