ఆ వార్తలపై రానా చాలా సీరియస్‌

0
564
rana fires on bollywood media because of fault news writes about bahubali movie hero

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

rana fires on bollywood media because of fault news writes about bahubali movie hero
‘బాహుబలి 2’ సాధించిన ఘన విజయంతో దేశంలో ఎక్కడ చూసినా కూడా చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్న టాపిక్‌ కనుక, మీడియా కూడా తెగ ఫోకస్‌ చేస్తుంది. అయితే కొన్ని హిందీ మీడియా సంస్థలు మాత్రం ‘బాహుబలి 2’పై చెడు కథనాలు, తప్పుడు వార్తలు ప్రచురిస్తుంది. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థ ‘బాహుబలి’కి చెందిన ఒక కథనంలో మొదట ఈ సినిమా కథను హిందీ హీరో హృతిక్‌ రోషన్‌ కోసం అనుకున్నారని, ఆ కథకు హృతిక్‌ కొన్ని కారణాల వల్ల ప్రభాస్‌కు వెళ్లింది. ఒక వేళ ఈ సినిమా హృతిక్‌ రోషన్‌ చేసి ఉంటే ఇప్పటి వరకు రెండు వేల కోట్లు సునాయాసంగా వచ్చేవంటూ సదరు కథనంలో పేర్కొన్నారు. అయితే ఆ మీడియా సంస్థలో వచ్చిన వార్తలపై రానా చాలా సీరియస్‌ అయ్యాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ మీడియాలో వచ్చిన వార్తలను కొట్టి పారేశాడు. ‘ఈగ’ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రభాస్‌తో రాజమౌళి ఒక సినిమా తెరకెక్కించాలని భావించాడు. అందుకోసం ఒక మంచి పవర్‌ ఫుల్‌ కథ, ప్రభాస్‌కు సూట్‌ అయ్యేలా ఉండే కథను తయారు చేయాల్సిందిగా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజమౌళి చెప్పడం, ప్రభాస్‌ కోసం విజయేంద్ర ప్రసాద్‌ ఈ కథను సిద్దం చేయడం జరిగింది. అంతే తప్ప మరే హీరో కోసం దీనిని తయారు చేయలేదని, ముందుగా అనుకోను కూడా లేదని రానా పేర్కొన్నాడు. పిచ్చి పిచ్చి వార్తలును మానాలంటూ రానా కాస్త సీరియస్‌గా సదరు మీడియాకు వార్నింగ్‌ ఇచ్చాడు.

Leave a Reply