ఫ్రెండ్ కాబట్టే గెస్ట్ రోల్ చేశా: రానా

0
348
rana guest role in dhanush and gautham menon movie

Posted [relativedate]

rana guest role in dhanush and gautham menon movieఅప్పటివరకు అరకొర సినిమాలతో సర్దుకున్న  రానా బాహుబలి సినిమాతో  ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయాడు.  తాజాగా ఘాజీ వంటి డిఫ‌రెంట్ మూవీతో మరో స‌క్సెస్‌ ను త‌న ఖాతాలో వేసుకున్నాడు ఈ దగ్గుబాటి వారసుడు.  దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా రానా పేరే వినిపిస్తోంది.

కాగా కెరీర్ ప్రారంభం నుండి హీరోగా, విల‌న్‌గా డిఫ‌రెంట్ చిత్రాల‌ను చేయ‌డానికే ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తున్న రానా తెలుగులో కాకుండా త‌మిళం, హిందీ భాష‌ల్లో కూడా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం త‌మిళంలో గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `ఎన్నై నోకి పాయుమ్ తూటా` అనే చిత్రంలో ఓ గెస్ట్ రోల్‌లో చేశాడ‌ట రానా. ఈ విష‌యాన్ని స్వయంగా రానానే వెల్లడించాడట. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న రానా ఇంత సడెన్ గా గెస్ట్ రోల్ చేయడానికి  ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ త‌న‌కు మంచి మిత్రుడని,  కాబ‌ట్టే అతని సినిమాలో గెస్ట్ రోల్ చేశాన‌ని చెప్పుకొచ్చాడ‌ట‌. ప్రస్తుతం ఒక హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయడం కామన్ అయిపోడంతో రానా అభిమానులు కొందరు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా, మరి కొందరు  తమ అభిమాన హీరో తమిళ్ లో కేవలం గెస్ట్ రోల్స్ కే పరిమితం అయిపోతాడేమోనని ఆవేదన పడుతున్నారట. 

Leave a Reply