మళ్లీ తేజ చేతిలో మెగా ఫోన్… రానా హీరో

rana2టాలీవుడ్ లో ఓ వెరైటీ కాంబినేషన్ సెట్ అయ్యింది… సంచలన దర్శకుడు తేజ.. యంగ్ హీరో రానాలు ఓ సినిమా లో కలిసి పని చేయబోతున్నారు.. ఈ చిత్రం లో కాజల్, కేథరిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు..

చిత్రం, జయం, నువ్వు నేను వంటి చిత్రాలతో ఎంట్రీలోనే టాలీవుడ్ కి అదిరిపోయే హిట్స్ ఇచ్చారు డైరెక్టర్ తేజ… తర్వాత ఆయన సక్సెస్ కి దూరమయ్యారు. ప్రేమ, ప్రేమ పోరాటం, ప్రేమికుల కోసం వేట.. కాస్త అటూ ఇటూ గా ఈ దగ్గర్లోనే తేజ బ్లాక్ అయిపోయారు .. దాంతో వరుస వైఫల్యాలు పలకరించాయి. ఇపుడు ఫ్రెష్ నెస్ నిండిన స్క్రిప్ట్ తో రానా ని మెప్పించారు. సినిమా ఓకే చేయించారు.. ఒకప్పుడు తన చేతిలో హీరోయిన్ గా పరిచయమైనా కాజల్ ని ఈ సినిమాలో తీసుకుంటున్నారు.. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు..

మొత్తానికి తేజ, రానా కాంబినేషన్ టాలీవుడ్ లో కుతూహలం రేకెత్తిస్తోంది…

Leave a Reply