Posted [relativedate]
రానా దగ్గుపాటి.. హీరోగా కంటే లవ్ ఎఫైర్స్ నడపడంలో ఫేమస్. ఇక, ‘బాహుబలి’తో ఇండియన్ సినిమాలో ఓ కొత్త స్టార్‌గా ఎదిగాడు. ఈ చిత్రం తర్వాత కూడా ఎఫైర్స్ ని కంటిన్యూ చేస్తున్నట్టు సమాచారమ్. అప్పట్లో త్రిష. ఇప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్ పేర్లని రానా ప్రక్కన చేర్చి గాసిప్ రాయుళ్లు రాతలతో రెచ్చిపోతున్నారు.
అయితే, తాజాగా రానా ముద్దుగుమ్మ కాజల్ గాజులపై మోజు పడినట్టు తెలుస్తోంది. వీరిద్దరు జంటగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇదో పొలిటికల్ థ్రిల్లర్. ఈ సినిమాలో నవదీప్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు బుధవారం నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. చిత్రం షూటింగ్ మొదటి రోజే మనోడు మొదలెట్టాడు. “సరదాగా కాజల్ చేతికి, తన చేతికి ఉన్న ఆర్నమెంట్స్‌ను చూపిస్తూ రానా ఓ ఫోటో తీసి పోస్ట్ చేసి.. ‘సూపర్ స్టార్ కో స్టార్ కాజల్‌ను తమ కొత్త సినిమాలోకి ఆహ్వానిస్తున్నా'” అంటూ కామెంట్ పెట్టాడు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాజల్ కూడా ఇదే ఫోటో పోస్ట్ చేస్తూ.. ‘రానాతో కలిసి నటించడం సంతోషంగా ఉంద’న్నారు.
ఈ పిక్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినబడుతున్నాయి. రానా కాజల్ గాజులపై మోజు పడ్డాడా.. ? లేదా కాజల్ పైనేనా అంటూ నెటిజర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Introducing to you my superstar co-star!’ @MsKajalAggarwal to new beginnings
When #brainsandbrawn come together, work becomes super fun! With @RanaDaggubati #newbeginnings #karaikudi