Posted [relativedate]
దగ్గుబాటి రానా, నాగ చైతన్య కలిసి ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేస్తున్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ న్యూస్ అయ్యింది. అదేంటి ఇద్దరికి ఇప్పటికే సొంతంగా ప్రొడక్షన్ హౌజెస్ ఉన్నాయి కదా అంటే ఆ సంస్థలు కేవలం పెద్ద సినిమాలకే ప్రాముఖ్య ఇస్తుండటంతో చిన్న సినిమాలు ప్రయోగాత్మక సినిమాలకు అడ్డాగా తమ ప్రొడక్షన్ హౌజ్ ఉండాలని ఈ నిర్ణయానికి వచ్చారు. ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన ఈ నిర్మాణ సంస్థకు సమంత కూడా భాగస్వామ్యం అవుతుందట.
ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి ఓ కుర్ర డైరక్టర్ కథ విని ఓకే చేయడం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అవడం జరిగిందట. హర్రర్ నేపథ్యంతో వచ్చే ఈ సినిమాతో తమ ప్రొడక్షన్ కాన్సెప్ట్ ఏంటో తెలియచేసేలా సినిమా తీస్తున్నారట. అంతేకాదు ప్రతిభ గల దర్శకులు ఎవరికైనా తమ నిర్మాణంలో సినిమా చేసేందుకు ఆహ్వానం అంటున్నారట. క్రియేటివిటీ ఎక్కువై అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారెవరైనా ఈ ఛాన్స్ వాడుకుంటే మంచింది.
కుర్ర హీరోలు అది కూడా మంచి ఫాంలో ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఇలా సొంతంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం మంచి విషయమే. మరి ఇద్దరు కలిసి చేస్తున్న నిర్మాణ సంస్థ నుండి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.