‘గురు’ డుకి అబ్బాయి రీప్లేస్మెంట్?

Posted April 6, 2017

rana replace venkatesh role in guru movie sequel
‘గురు ‘…బాక్సాఫీస్ వద్ద బాగా ఆడుతున్నాడు .కాటమరాయుడుకి కూడా గట్టి పంచ్ లే ఇచ్చి రేసులో దూసుకెళుతున్నాడు. ఓ కొత్త తరహా సినిమాతో భారీ హిట్ కొట్టిన వెంకీకి అబ్బాయి రానా ద్వారానే పోటీ వచ్చి పడింది.దర్శకురాలు సుధా కొంగర గురు సీక్వెల్ కి ప్లాన్ చేస్తోంది.స్టోరీ లైన్ కూడా రెడీ అయ్యింది.అయితే అందులో హీరో కుర్రవాడు కావడంతో ఈసారి వెంకీ బదులు రానాకి స్టోరీ వినిపించి ఓకే చేయించుకుందట.ఇంతకుముందు గురు స్టోరీ ముందు రానాకు చెప్పి తర్వాత జరిగిన మార్పులు,చేర్పుల్లో వెంకీ అబ్బాయి పాత్రలోకి వచ్చేసాడు.ఇప్పుడు బాబాయికి అబ్బాయి రీ ప్లేస్ మెంట్ అవుతున్నాడు.

రానా హీరోగా సీక్వెల్ గా వచ్చే గురులో మిగిలిన పాత్రలు దాదాపు అవే ఉంటాయట. హీరో పాత్ర మాత్రమే మారుతుందట.ఈ మార్పుని పాత గురుకి కొత్త గురుకి సింక్ చేయడం అంత తేలిగ్గాదు. అయితే ఓ దర్శకురాలిగా సుధా కొంగర టాలెంట్ చూసాక ఆ డౌట్ అక్కర్లేదనిపిస్తోంది.అల్ ది బెస్ట్ గురు

SHARE