మహేష్,పూరి కి పోటీగా వాళ్ళకి రానా వల..

0
259
rana start talent management company kwan for heroines dates against mahesh and puri jagannath

Posted [relativedate]

rana start talent management company kwan for heroines dates against mahesh and puri jagannath
బిజీ బిజీ హీరోయిన్లని మహేష్,పూరి జగన్నాథ్ వైపు నుంచి తన వైపు తిప్పుకోడానికి యంగ్ హీరో రానా ప్రయత్నం మొదలెట్టాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు..రానా ఆ సీనియర్స్ తో పోటీ పడుతోంది ఓ బిజినెస్ విషయంలో మాత్రమే ..అది హీరోయిన్ డేట్స్ ,ఇతర వ్యవహారాల్ని పర్యవేక్షించే ఓ కంపెనీ మొదలెట్టాడు రానా .ఈ కంపెనీ ఇంతకుముందు హీరోయిన్స్ వ్యక్తిగత మేనేజర్స్ చక్కబెట్టే అన్ని వ్యవహారాల్ని చూసుకుంటుంది.ఆ మేనేజర్స్ హీరోయిన్ల డేట్లు ,ఇతర సినీసంబంధమైన వ్యవహారాల్ని చూసుకునే వాళ్ళు.అందుకోసం హీరోయిన్స్ నుంచి దాదాపు 20 శాతం దాకా కమిషన్ తీసుకునే వాళ్ళు.అయినా ఇది పూర్తిగా వ్యక్తిగత స్థాయిలో జరిగే వ్యవహారం కాబట్టి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ,ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినా హీరోయిన్ లేదా ఆ మేనేజర్ దెబ్బతినే అవకాశముంది .

దానికి భిన్నంగా ఈ వ్యవహారాన్ని కార్పొరేట్ స్థాయిలో నిర్వహించేందుకు రానా టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ క్వాన్ ప్రారంభించారు.ఈ కంపెనీ లీడింగ్ హీరోయిన్స్ వ్యవహారాలతో పాటు సరికొత్త టాలెంట్ ని వెదికి అవసరమైన వారికి అందుబాటులోకి తెస్తుంది. ఇంతకుముందు ఇలాంటి వ్యాపారాన్ని మహేష్,పూరి కూడా మొదలెట్టారు.వారికి రానా పోటీ కావడం మాట అటుంచి వీళ్లంతా కలిసి మేనేజర్స్ పొట్టకొడుతున్నారు.

Leave a Reply