హాలీవుడ్ సినిమాలో రానా వాయిస్….

0
388

Posted [relativedate]

  rana voice over hollywood tom hanks inferno movie

‘బాహుబలి’ చిత్రంతో రానా దగ్గుపాటి (భల్లాల దేవుడు) క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవలే ‘బాహుబలి2’ షూటింగ్ ని పూర్తి చేసుకొన్న రానా బాలీవుడ్ చిత్రం “ఘాజీ” షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. 1971లో జరిగిన భారత – పాకిస్థాన్ యుద్ధంలో మనపై దాడికి వచ్చిన పాకిస్థాన్ జలాంతర్గామి ‘పి.ఎన్.ఎస్. ఘాజీ’ని విశాఖపట్నం సముద్రతీరంలో భారతీయ సైనికులు తెలివిగాముంచి వేశారు. ఆ నేపథ్యాన్ని తీసుకొని ‘ఘాజీ’ని తెరకెక్కిస్తున్నారు.

 ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదించుకొన్నాడు రానా. తాజాగా, ఓ హాలీవుడ్ చిత్రంలోనూ భాగస్వామిగా మారాడు. ఇండియన్ ప్రేక్షకుల్లోనూ క్రేజ్ సంపాదించుకున్న టామ్ హ్యాంక్స్ నటించిన చిత్రం ’ఇన్ఫెర్నో’. ఈ చిత్రం అక్టోబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు వర్షన్‌లో టామ్ హ్యాంక్స్‌కు రానా వాయిస్ అందించారు. ఇటీవలే డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు.

ప్రస్తుతానికైతే.. హాలీవుడ్ చిత్రంలో రానా వాయిస్ ఒక్కటి వినబడబోతోంది. ఇక, భవిష్యత్ రానా హాలీవుడ్ చిత్రంలో రానా యాక్షన్ కూడా చూడొచ్చేమో.. !!

Leave a Reply