రణబీర్ కపూర్ కత్రినా కైఫ్ నటిస్తున్నారా.?

    ranabeer kapoor  katrina kaif living togetherరణబీర్‌, కత్రినాల ప్రేమ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడిందని, ఇక ఇద్దరూ కలిసే ప్రసక్తిలేదని బాలీవుడ్‌ ఓ నిర్ణయానికొచ్చేసింది. రణబీర్‌తో బ్రేకప్ తరువాత ఇద్దరూ కలిసి ఉన్న ఇంటిని కత్రినా ఖాళీ చేసేసి కొత్త ఇంటికి మారింది. ఈ సందర్భంగా బాగా ముఖ్యమనుకున్న వారిని పిలిచి పార్టీ ఇచ్చిందట. ఇక్కడే ఓ ఆసక్తికర విషయం సంభవించిందట.

పార్టీకి వచ్చిన కొద్దిమంది అతిథులు వెళ్ళిపోగా ఈ సొగసరి క్లోజ్ ఫ్రెండ్ ఒక్కరే మిగిలారట! ఆ ఒక్క గెస్ట్‌ కూడా వెళ్ళిపోబోతుండగా, రణబీర్‌ నెమ్మదిగా ఇంట్లోకి వచ్చాడట! రణబీర్‌ని చూసి ఆ గెస్ట్‌ ఖంగుతినగా, కత్రినా మాత్రం రణబీర్‌ వస్తున్న విషయం తనకు ముందుగా తెలుసు అన్నట్టు ప్రవర్తించిందట! దాంతో వీరిద్దరూ నిజంగా విడిపోలేదనీ, విడిపోయినట్టు నటిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

SHARE