Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్‌చరణ్ ‘ధృవ’ చిత్రం తర్వాత భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సాధించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత ప్రస్తుతం రామ్‌చరణ్ సుకుమార్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ను దర్శకుడు సుకుమార్ ప్రకటించాడు. ‘రంగస్థలం 1985’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా ప్రకటించారు. టైటిల్‌తో చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది.
టైటిల్ విషయంలో కాస్త ఎక్కువ చర్చ జరిగినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. మొదట ఈ టైటిల్‌ను చిరంజీవి వద్దన్నాడని, కాస్త ఓల్డ్ అనిపిస్తుందని అన్నాడట. అయితే సుకుమార్ మాత్రం కథకు తగ్గట్లుగా, ప్రేక్షకులను ఆలోచింపజేసినట్లుగా టైటిల్ ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇదే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన చూసి చిరంజీవి కూడా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి ఈ టైటిల్ ప్రకటించిన సమయంలో విదేశాల్లో ఉన్నాడు. అయినా కూడా సుకుమార్ ధైర్యంగా చిరంజీవిని ఒప్పిస్తాననే నమ్మకంతో టైటిల్‌ను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ‘రంగస్థలం 1985’ అనగానే ఏంటా అని అంతా కూడా ఆసక్తిని కనబర్చుతున్నారు. టైటిల్లో 1985 ఏంటో అనే చర్చ జరుగుతూ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి చిరంజీవి నో చెప్పిన టైటిల్‌కే ఓకే చెప్పించిన సుకుమార్ సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.