రజని ఛాన్స్ ఇచ్చాడా ? లాక్కొన్నాడా ?

0
646

ranjith1
కబాలి ఫలితం చూసిన డైరెక్టర్ రంజిత్ కి కొత్త డౌట్ వచ్చిందంట .ఇంతకీ రజని తనకు ఛాన్స్ ఇచ్చినట్టా? లాక్కొన్నట్టా ? అని .అందుకు చాలా కారణాలు వున్నాయి .మద్రాస్ సినిమా హిట్ తరువాత తమిళ్ హీరోలు చాలామంది రంజిత్ కి సినిమా ఇద్దామనుకున్నారు .అయన కధలు కూడా విన్నారు.ఇంతలో రజిని సినిమాకి అవకాశం వచ్చింది .రియలిస్టిక్ సినిమా రంజిత్ కి బలం ..కానీ చేతిలో వున్నది ఆకాశమంత ఇమేజ్ వున్న రజని.దాంతో కొంత నేల విడిచి సాము చేయక తప్పలేదు .రజని గెట్ అప్ చూసాక స్టార్ హీరోలు రంజిత్ వెంటపడ్డారు .

కబాలి రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది .ఆ సీన్ ఇలా తీయాల్సింది కాదని రంజిత్ కే కొందరు పాఠాలు చెప్తున్నారంట .ఈ కామెంట్లు విని హర్ట్ అయిన రంజిత్ ఇంతకీ రజని ఛాన్స్ ఇచ్చాడా? లాక్కున్నాడా ? అని అనుకోవడంలో తప్పేముంది ..

Leave a Reply