‘విలన్’ గా రాశి ఖన్నా..

Posted April 10, 2017

rashi khanna as villain role in mohanlal unnikrishnan movieరాశి ఖన్నా… ఊహలు గుసగుసలాడే మూవీ తో అరంగేట్రం చేసి యువకుల హృదయాలు కొల్ల గొట్టిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో చాలా బిజీ గా అయిపోయింది. స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులు పట్టుకోవడంలో ఈ మధ్య బాగానే సక్సెస్ అవుతుంది ఈ భామ.. తాజాగా మలయాళీ సినీ పరిశ్రమలో కూడా అరంగేట్రం చేసేస్తోంది.

బి. ఉన్నికృష్ణన్ దర్శకుడుగా మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో రాశిఖన్నాను తీసుకున్నారు. కొన్ని వారాల క్రితమే ఈమె వెర్షన్ షూటింగ్ కూడా మొదలైపోయింది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాశి ఖన్నా ఈ చిత్రం లో గ్లామర్ పాత్రలో కాకుండా నెగటివ్ రోల్ లో నటిస్తోంది.. ఈ నెగటివ్ రోల్ లో నటించటానికి కారణం.. ఈ రోల్ అచ్చం రజినీకాంత్ నటించిన నరసింహ మూవీ లో రమ్య కృష్ణ పాత్రలా ఉంటుందంట.. ఈ సినిమాలో రమ్య కృష్ణ కి తిరుగులేని పేరు,మంచి స్పందన వచ్చింది. అందుకే రాశి ఖన్నా కూడా ఈ క్యారెక్టర్ గురించి చెప్పగానే వెంటనే ఓకే చెప్పేసింది. మరి కొన్ని రోజుల్లోనే రాశి ఖన్నా పాత్రకు సంబంధించిన పార్ట్ పూర్తయిపోనుందట.టాప్ హీరోయిన్ రేసులో ఉన్న సమయంలో నెగిటివ్ రోల్ చేసేందుకు సై అనడం అంటే.. రాశి ఖన్నా డేరింగ్ ని పొగడాల్సిందే.

ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు, తమిళ్ నుంచి.. విశాల్.. హన్సికలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఇంత పెద్ద కాస్టింగ్ ఉన్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో, ఈ చిత్రంలో నెగటివ్ క్యారెక్టర్ లో రాశి ఖన్నా ఏ మేరకు రానిస్తుందో చూడాలి.

SHARE