భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన మోడీ

137

Posted November 30, 2016, 4:42 pm

Image result for rashmin jain lady giving divorce her husband because of modi

పెద్ద నోట్ల రద్దు దెబ్బకు పచ్చని సంసారాలు కూడా కూలిపోయే పరిస్థితి వచ్చేసింది. ఈ అంశం భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తోంది. ఒకరు ఔనంటే మరొకరు కాదంటూ మోడీ కోసం కొట్లాడుకుంటున్నారు.

రశ్మీన్ జైన్ అనే మహిళ ఆమె భర్తతో ఏదో మాట్లాడుతుండగా నోట్ల రద్దు అంశం ప్రస్తావనకొచ్చిందట. కరెన్సీ కష్టాలతో చిర్రెత్తుకొచ్చిన ఆయన.. మోడీని నోటికొచ్చినట్టు తిట్టారట. దీంతో ఆ భార్యామణికి విపరీతంగా కోపం వచ్చేసింది. మోడీ తరపున వకాల్తా తీసుకొని.. పెద్ద నోట్లు రద్దు.. దాని ప్రయోజనాలపై గట్టిగానే మాట్లాడింది.

రశ్మీన్ జైన్ అంతటితో ఊరుకోలేదు. మోడీపై బహిరంగంగా ప్రశంసలు కురిపించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఆమె ప్రధాని మోడీ నిర్ణయాన్ని సపోర్టు చేస్తూ… అవసరమైతే తన భర్తకు విడాకులివ్వడానికి కూడా సిద్ధమని ప్రకటించింది. ఇలా మోడీ నిర్ణయం భార్యాభర్తల మధ్య పెద్ద రచ్చకు తెరతీసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here