ఐటెంకు ఆమె కూడా సై..!

0
439
reshmi

Posted [relativedate]

Image result for rashmi

బుల్లితెర మీద అనసూయ వారసత్వం అదేనండి జబర్దస్త్ షోని అనసూయ తర్వాత కంటిన్యూ చేసి ఆ క్రేజ్ తో గుంటూర్ టాకీస్ తో కుర్ర కారుని గిలిగింతలు పెట్టిన రష్మి ఇప్పుడు మరో స్టెప్ ముందడుగేసి ఐటం సాంగ్ కు ఓకే అనేస్తుందట. స్టార్ సినిమా అంటే ఐటం సాంగ్ ఉండాల్సిందే అనే పరిస్థితులున్న ఈ టైంలో అర కొర అవకాశాలున్న ఏ హీరోయిన్ అయినా ఐటం ఆఫర్ వస్తే కాదనకుండా చేసేస్తుంది. అలా అయినా సరే ఆడియెన్స్ లో ఓ ఐడెంటిటీ తెచ్చుకున్నట్టు ఉంటుందని వారి ఆలోచన ఆ క్రమంలోనే రాజ్ తరుణ్ సినిమాలో రష్మితో ఐటం సాంగ్ కోసం ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు వంశీ కృష్ణ.

ఏ.కె ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ కిట్టుగాడు అని పెట్టారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆడియెన్స్ ను అలరించిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ తో స్టెప్పులేసేందుకు ఓ ఐటం గాళ్ అవసరం పడ్డదట. అందుకోసం జబర్దస్త్ ఫాంలో ఉన్న రష్మిని అడిగారని టాక్. ఒకవేళ రష్మి ఈ సాంగ్ ఒప్పుకుంటే కనుక ఇక ఐటం గా కూడా అమ్మడి రచ్చ మొదలైనట్టే. ప్రస్తుతం రష్మి రెస్పాన్స్ కోసం కిట్టుగాడు టీం ఎదురుచూస్తుందట.

కుర్ర హీరోలో మంచి ఫాలోయింగ్ ఉన్న రాజ్ తరుణ్ తో రష్మి ఐటం సాంగ్ అంటే క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. మరి అమ్మడు అడ్డు చెప్పడానికి రెమ్యునరేషన్ ఏమన్నా కారణం కావొచ్చు కాని ఆఫర్ మాత్రం కళ్లుమూసుకుని ఓకే చేయాల్సింది. సో రష్మిని ఐటంగా చేసి తన ఎకౌంట్ లో మరో హిట్ సినిమా పడాలనుకుంటున రాజ్ తరుణ్ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Leave a Reply