స్టైలిష్ స్టార్ కే దెబ్బేసిన రష్మి..!

0
541

Posted [relativedate]

Image result for rashmi gautam

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు రష్మికి అసలు సంబంధం ఏంటి.. అయినా అల్లు అర్జున్ రేంజ్ కు రష్మి రేంజ్ కు పోలిక ఏంటి అని కన్ ఫ్యూజ్ అవ్వొచ్చు. బుల్లితెర నుండి సిల్వర్ స్క్రీన్ మీద తన అదృష్టాన్ని పరిక్షించుకునే ప్రయత్నంలో రష్మి గుంటూర్ టాకీస్ సినిమాతో ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది. విచ్చల విడి అందాల ప్రదర్శనతో ఒక్కసారిగా శృంగార దేవతగా కనిపించిన అమ్మడు ఆ సినిమాలో ‘నీ సొంతం’ పాటలో రెచ్చిపోయింది.

అయితే బన్ని రేసుగుర్రంలోని ‘సినిమా చూపిస్త మావ’ సాంగ్ యూట్యూబ్ లో సూపర్ హిట్. అత్యధికంగా వ్యూయర్ కౌంట్ ఉన్న వాటిలో అది ఒకటి. ఇక ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేసింది రష్మి. బన్ని సాంగ్ కంటే ఎక్కువ వ్యూయర్ షిప్ తో రష్మి సాంగ్ హల్ చల్ చేస్తుంది. అందాలను ఎరగా వేసి ఆడియెన్స్ ను తన మత్తులో పడేసిన రష్మి ఆ ప్రయత్నంలో సూపర్ సక్సెస్ అయ్యింది. బన్ని సాంగ్ 19 లక్షల పైగా వ్యూయర్ కౌంట్ సాధిస్తే.. రష్మి పాట 20 లక్షలు దాటేసింది. సో ఈ లెక్కన చూస్తే స్టైలిష్ స్టార్ ఇమేజ్ కు రష్మి దెబ్బేసినట్టే. కేవలం ఆ ఒక్క సినిమాతోనే రష్మి క్రేజ్ సంపాదించింది. ఇక అదే ఇమేజ్ తో అలాంటి సినిమాలనే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది లేండి.

Leave a Reply