దేశంలో రాజకీయంగా,ఆర్థికంగా బలమైన ముద్ర వేసిన తెలుగు రాష్ట్రాలు పరిపాలన విభాగం లో తనదైన మార్క్ చూపలేకపోయాయి.అయితే ఆ ముచ్చట కూడా తీరబోతోంది.పొరుగున వున్న తమిళనాడులో ఇప్పటికే తెలుగు IAS పాలిశెట్టి రామ్మోహన్ చీఫ్ సెక్రటరీగా రాణిస్తున్నారు.ఇప్పుడు మరో సరిహద్దున కర్ణాటక లోను తెలుగు ఆడబిడ్డ ఆ కీలక పదవికి ఎంపికకానున్నారా? కర్ణాటక నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ వార్త నిజం కాబోతోంది.ఆమె మరెవరోకాదు IAS రత్నప్రభ….ఈ ఇద్దరూ ప్రకాశం జిల్లా మూలాలున్న వాళ్లే కావడం విశేషం …
నిర్భీతికి నిలువుటద్దం IAS రత్నప్రభ ….ఆమె కుటుంబ నేపధ్యం కూడా అలాంటిదే…ఆమె తండ్రి పేరు కత్తి చంద్రయ్య IAS …ప్రకాశం జిల్లా ఉప్పు గుండూరు దగ్గర్లో పోతారం అనే చిన్న పల్లెటూరు ఆయనది…నిరు పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన ఆయన గురించి జిల్లాలో ఇప్పటికీ కథలు కథలు గా చెప్పుకొంటారు.చిన్నప్పుడు ఓ సారి గేదెలు కాస్తున్న చంద్రయ్య కింద పడివున్న కాగితాన్ని చదువుతుంటే …ఓ భూస్వామి కండకావరం తో ఏం చదివి కలెక్టర్ అవుదామనుకున్నావా ?అన్నాడంట ..ఆ మాటల్ని కసిగా తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలకు ఓర్చి IAS గా తిరిగి సొంత గడ్డ పై అడుగుపెట్టారంట…ఆయన కూతురే రత్నప్రభ.
తండ్రి జీవితాన్ని దగ్గర నుంచి చూసిన ఆమె క్రమశిక్షణ తో IAS సాధించారు.వృత్తి పరంగా ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా ఆమె దీటుగా ఎదుర్కొన్నారు.ఆమె గురించి చెప్పాలంటే ఓ చిన్న సంఘటన చాలు..వైస్. జగన్ పుణ్యమాని కొన్ని నిర్ణయాల వల్ల కోర్టులు చుట్టూ తిరగాల్సి వచ్చింది.ఇంకొకరైతే ఏం చేసే వాళ్లో కానీ .. ఆమె నేరుగా కోర్టు ప్రాంగణం లో జగన్ కళ్ళలోకి సూటిగా చూస్తూ వాటీజ్ దిస్ జగన్ ?అని ప్రశ్నించారు .మీరు చేసిన తప్పుకి మేమెందుకు ఫలితం అనుభవించాలని నిలదీశారు.ఆ కేసుల నుంచి ఉపశమనం కలిగాక ఆమె కర్ణాటక క్యాడర్ కు వెళ్లారు. రత్నప్రభ నిజాయితీ,నిర్భీతి చూసి ఆమెను చీఫ్ సెక్రటరీగా తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భావిస్తున్నారట.
ఇక రత్నప్రభ పెళ్లిచేసుకున్న విద్యాసాగర్ కూడా ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన IAS అధికారే.ఇక ఆమె సంతానం కూడా IAS సాధించింది. అటు తమిళనాడులోనూ చీఫ్ సెక్రటరీ గా రామ్ మోహన్ తనదైనా ముద్ర వేశారు. జయలలిత మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడానికి కారణమైనా ఎన్నో పధకాలు ఆయన రూపొందించినవే, ఎవర్ని అంత తొందరగా నమ్మని జయ కూడా ఆయన నిర్ణయాలు పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తారట. ఆయనతో పాటు రత్నప్రభ కూడా కర్ణాటక చీఫ్ సెక్రటరీ గా నియమితులైతే పొరుగున రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్లే ఒకసారి కీలక బాధ్యతలు నిర్వహించినట్టవుతుంది…. ఈ ఘనత దక్కితే ప్రకాశం ప్రజలు పొంగిపోవటం ఖాయం.
www.telugubullet.com