త్రిసభ్య కమిటీ కి రావెల భవిష్యత్..

Posted December 24, 2016

ravela in trisabhya committeeఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్ల మధ్య చోటు చేసుకున్న వివాదంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. తనను రావెల హత్య చేయించేందుకు యత్నించారంటూ జానీ మూన్ ఆరోపించడంతో దానిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు  చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జీవీ ఆంజనేయులుతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలంటూ కళా వెంకట్రావును చంద్రబాబు ఆదేశించారు.

సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబుతో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్ భయాందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మంత్రి రావెల సహాయ నిరాకరణ ధోరణి అవలంబిస్తున్నారని, తాను చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని అడిగితే.. మీ అంతు చూస్తాను అం టూ బెదిరించారని, తన మనుషులను ఇంటి కి పంపి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నా రంటూ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

SHARE