రావెల పదవికి మహిళా గండం?

Posted December 24, 2016

ravela ministry had lady hand
ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు పదవికి మహిళా గండం ఉన్నట్టుంది.అయన ఏపీ మంత్రిగా పదవి చేపట్టి నిండా మూడేళ్లు కాలేదు.కానీ ఇప్పటికి మూడు సార్లు అయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రతిసారి మహిళల వల్లే అయన పదవి ఊడుతుందేమోనన్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొదటిసారి హైదరాబాద్ లో ఓ వివాహితని రావెల కుమారుడు నడిరోడ్డు మీద ఈవ్ టీజింగ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. రెడ్ హ్యాండెడ్ గా రావెల కుమారుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని పోలీసులకి అప్పజెప్పారు.అప్పట్లో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. చివరికి ఫిర్యాదు చేసిన మహిళ వెనక్కి తగ్గడంతో ఆ కేసు నుంచి రావెల కొడుకు ..పదవీ గండం నుంచి రావెల బయటపడ్డారు.

సమస్య తప్పిపోయిందని రావెల సంతోషపడుతున్న టైం లోనే గుంటూరులో మరో ఇబ్బంది.రావెల కుమారుడు ఓ ఇంజనీరింగ్ కాలేజీ మహిళల హాస్టల్ ముందు వీరంగం వేయడం పత్రికల్లో వచ్చింది. అది కూడా జనం మర్చిపోతున్న దశలో ఈసారి ఏకంగా రావెల వ్యవహార శైలి మీదే ఆరోపణలు వచ్చాయి.ఓ మహిళా జడ్పీ చైర్ పర్సన్ తమ కుటుంబానికి మంత్రి రావెల ,అయన అనుచరుల వల్ల ప్రాణహాని ఉందని ఆరోపించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.దీంతో మండిపడ్డ సీఎం చంద్రబాబు విచారణకి ఆదేశించారు.ఆది నుంచి రావెల రాజకీయ ప్రస్థానాన్ని చూస్తున్న వాళ్ళు ఆయనకి మహిళా గండం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

SHARE