రవితేజ ఇంటర్వెల్ వెనుక ఆ ముగ్గురు…

Posted October 10, 2016

    ravi teja new movie starting late reasons producers

ఫటాఫట్ సినిమాలు తీసి ప్రేక్షకులని మస్త్ ఖుషి చేసే కథానాయకుడు మాస్ మహారాజ రవితేజ. అయితే, ఈ మధ్య రవితేజ నెమ్మదించాడు. ‘బెంగాల్ టైగర్’
తర్వాత మునుపెన్నప్పుడు లేనివిధంగా దాదాపు 9నెలల పాటు ఖాళీగా ఉన్నాడు మాస్ మహారాజా. ఇది ఆయన అభిమానులకి ఏమాత్రం నచ్చడం లేదు.

రవితేజ నెమ్మదించడంలో ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆయన కావాలని ఖాళీగా లేడట. ఓ ముగ్గురి నిర్మాతలు చేసిన మోసం
కారణంగా మాస్ మహారాజ ప్రేక్షకుల ముందుకు రావడం లేటయ్యింది అని చెప్పుకొంటున్నారు. ఆ నిర్మాతలు రవితేజతో ఓ ఆటాడుకొన్నారట.ఇంతకీ ఆ  నిర్మాతలు ఎవరంటారు.. ?

బెంగాల్ టైగర్ తర్వాత ‘ఎవడో ఒకడు’ చిత్రాన్ని చేయాల్సి ఉంది మాస్ మహారాజ. దిల్ రాజు బ్యానర్ లో రావాల్సిన ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో తేడా
రావడం వదులుకొన్నాడట. ఆ తర్వాత కొత్త దర్శకుడు చక్రితో ఓ సినిమా కమిట్ అయ్యాడు. చక్రీ వినిపించిన లైన్ నచ్చినా.. పూర్తి స్క్రిప్ట్ రవితేజని
సంతృప్తిపరచలేక పోయిందట. దర్శకుడు విక్రమ్ సిరితోనూ ఓ సినిమాకి కమెంట్ మెంట్ ఇచ్చాడు రవితేజ. ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో.. ఇప్పటి వరకు
క్లారిటీ లేదు.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు మాస్ మహారాజా. ఈ సినిమా ఎప్పుడో ఓకే అయినా.. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇందుకు కారణం మొదట ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా ఉన్నాడు. మహేష్ సినిమా కోసం రవితేజని వదిలేశాడు డివివి. పెద్ద నిర్మాత ప్రక్కకు తప్పుకోవడం బాబీ సినిమా లైట్ తీసుకొన్నాడు రవితేజ. నిర్మాత రామ్ తళ్లూరి గురించి ఎంక్వైరీ చేసి అప్పుడు బాబీ సినిమాకి ఓకే అన్నాడు మాస్ మహారాజ. మొత్తానికి ఎన్నో ట్విస్టుల తర్వాత బాబీ-రవితేజ సినిమా ఓకే అయ్యింది.

నిర్మాతల వ్యవహార శైలి వల్ల ఈసారి ప్రేక్షకులకి చాలా రోజుల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే, ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా చూసుకొంటాను.
వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తానంటున్నాడు మాస్ మహారాజ.

SHARE