రీమేక్ లో రవితేజ..

 Posted March 25, 2017

ravi teja remake tamil movie bogan in teluguఇటీవల టాలీవుడ్ లో రీమేక్ లు ఎక్కువైపోతున్నాయి. చిన్న హీరో.. పెద్ద హీరో అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు రీమేక్ ల మీద పడ్డారు. ఇతర భాషల్లో ఘనవిజయం సాధించడంతో ఇక్కడ కూడా మినిమమ్ గ్యారెంటీ ఉండడమే అందుకు కారణం. ఖైదీ నెం. 150, కాటమరాయుడు సినిమాలు కూడా రీమేక్ మూవీలే. తమిళ్ లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాలు తెలుగులో కూడా సక్సెస్ అయ్యాయి. కాగా తాజాగా మాస్ మాహారాజా రవితేజ కూడా ఓ రీమేక్ సినిమాను చేయనున్నాడట.

ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే రవితేజ బెంగాల్ టైగర్ సినిమా తర్వాత కాస్త జోరు తగ్గించాడు. 2015లో విడుదలైన బెంగాల్ టైగర్ యావరేజ్ అవ్వడం వల్లో లేక అందరూ అనుకుంటున్నట్లు అనారోగ్య సమస్యల వల్లో గతేడాది అడ్రస్ లేకుండా పోయాడు. అయితే ప్రస్తుతం రవితేజ మళ్లీ  స్పీడు పెంచాడని చెప్పవచ్చు.  విక్రంసిరి దర్శకత్వంలో టచ్ చేసి చూడు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్  సినిమాలతో ఫుల్ బిజీగా ఫుల్ జోష్ తో ఉన్న రవి మరో  సినిమాకు కూడా ఓకే చెప్పాడని సమాచారం.

తమిళంలో లక్ష్మణ్ తెరకెక్కించిన బోగన్  సినిమా రీమేక్ నటించనున్నాడట. అరవింద్ స్వామి, జయం రవి ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా కోలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించింది. ఈ తెలుగు రీమేక్ కి  కూడా లక్ష్మణే దర్శకతవ్వం వహించనున్నాడట. జయం రవి పోషించిన పాత్రకి గాను రవితేజను ఒప్పించాడట దర్శకుడు. అలానే అరవింద్ స్వామి ప్రాతకి సోనూ సూద్ ని  ఒప్పించే పనిలో ఉన్నాడట. మరి రవితేజకు ఈ రీమేక్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

SHARE