మెగాఫోన్ పట్టనున్న మాస్ మాహారాజా..

0
446
ravi teja will be do directing a movie

Posted [relativedate]

ravi teja will be do directing a movieమాస్ మ‌హారాజా ర‌వితేజ తన కెరీర్ ను మొదట  అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ గానే మొదలుపెట్టాడన్న  సంగతి తెలిసిందే. ఆ తర్వాత హీరోగా మాస్ మహారాజా స్థాయికి ఎదిగాడు. తాజాగా ఈ ముదురు హీరో మెగాఫోన్ పట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.

ఇటీవ‌లే ట్విట్ట‌ర్‌  ఖాతా తెరిచిన రవితేజ సరదాగా అప్పుడప్పుడు తన అభిమానులతో ఛాట్ చేస్తుంటాడు. ఓ అభిమాని రవితేజను డైరెక్షన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అని అడిగాడట. దానికి స్పందించిన రవితేజ త‌ప్ప‌కుండా సినిమాలకు ద‌ర్శ‌క‌త్వం వహిస్తానని, అయితే  తాను దర్శకుడిగా ఎప్పుడు  అవ‌తారం ఎత్తుతానో తెలియ‌ద‌ని చెప్పాడు. కాగా మాస్ మహారాజా గతేడాది ఏ సినిమా చేయకుండా కాస్త వెనకపడ్డాడు. దీంతో ఇక అతను హీరోగా కష్టమని రకరకాలుగా వార్తలు రావడంతోనే రవితేజ డైరెక్షన్ బాట పట్టాలనే ఆలోచనలో ఉన్నాడంటున్నారు సినీ విశ్లేషకులు.

Leave a Reply