చందూతో రవితేజ ?

 Posted October 31, 2016

ravi teja with chandu mondeti movieచందూ మొండేటి..’ప్రేమమ్’ రిమేక్ తో మరింత ఫేమస్ అయిపోయాడు.తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ‘ప్రేమమ్’ని మలచడంతో చందూకి మంచి మార్కులు పడ్డాయి .ప్రేమమ్ రిమేక్ తో నాగ చైతన్యకి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందించాడు.అదే టైంలో నాగార్జున మనసును దోచేశాడు.చందూతో అడిగి మరీ..నాగ్ రెండు కథలని రెడీ చేయించుకొన్నాడు.అయితే,ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ని కొట్టేశాడు చందూ.ఏకంగా మాస్ మహారాజ రవితేజని డైరెక్ట్ చేయనున్నాడు.

ఇటీవలే రవితేజకు కథని వినిపించాడు చందు.ఆ కథ మాస్ మహారాజకి బాగా నచ్చేసింది.దీంతో..చిన్న చిన్న మార్పులతో స్క్రిప్టు ఓకే చెప్పేశాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది.కార్తికేయ తరహాలో కథకి కమర్షియల్ హంగులతో కోటింగ్ వేసి ఓ కథని రెడీ చేశాడట చందూ.అది రవితేజని సూపర్భ్ గా సెట్టవుతుందని చెబుతున్నాడు.మాస్ మహారాజకి ఓ హిట్టివ్వగలిగితే చందూ జాతకం పూర్తిగా మారినట్టే.

సామాజిక అంశానికి కమర్షియల్ కోటింగ్ వేయడంలో దిట్ట కొరటాల శివ.ఈ క్రమంలో ఓ కొత్త జోనర్ ని క్రియేట్ చేశాడు కొరటాల.ఇప్పుడు చందూ మొండేటి కూడా తనదైన శైలికి కమర్షియల్ కోటింగ్ తో కొత్త జానర్ ని రెడీ చేయనున్నాడు.మరి అదెంత వరకు ప్రేక్షకులని నచ్చుతుందో చూడాలి.

SHARE