మళ్లీ టూరేసిన మాస్ మహరాజ్..!

0
590
Raviteja Gone To America With His Friends

Raviteja Gone To America With His Friendsమాస్ మహరాజ్ రవితేజ సినిమా బెంగాల్ టైగర్ వచ్చి దాదాపు సంవత్సరం దాటింది. ఈ సంవత్సరం ఇప్పటిదాకా కనీసం సినిమా కూడా ఓపెన్ చేయని రవితేజ వచ్చే ఏడాది కూడా ఇదే పంథా కొనసాగించేలా ఉన్నాడు. బాబితో సినిమా పట్టాలెక్కినట్టే ఎక్కి ఆగిపోవడంతో మళ్లీ అనీల్ రావిపూడితో ఫిక్స్ అయిన రవితేజ ఆ సినిమా ముహుర్తం పెట్టే టైం కు మళ్లీ అమెరికా జంప్ అయ్యాడట. ఫ్రెండ్స్ తో జాలీ ట్రిప్ అంటూ 15 రోజులు ట్రిప్ వేశాడట రవితేజ. అసలైతే దిల్ రాజు ప్రొడక్షన్ లో ఎవడో ఒకడు సినిమా చేయాల్సిన రవితేజ రెమ్యునరేషన్ గొడవలతో ఆ సినిమా లైట్ తీసుకున్నాడు.

తీరా మళ్లీ అదే దిల్ రాజుతో సినిమా కమిట్ అయ్యాడు రవితేజ. ప్రస్తుతం అనీల్ రావిపూడి సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశాడట. ఇక నేడో రేపో షూటింగ్ స్టార్ట్ అని చెప్పేలోగా ఈ టూర్ ప్లాన్ చేశాడట రవితేజ. మరి సినిమాలే ఊపిరిగా జీవించే రవితేజ 2016 సంవత్సరంలో ఒక్క సినిమా కూడా చేయకపోవడం ఫ్యాన్స్ కు కాస్త షాకింగ్ గానే ఉంది. త్వరగా ఆ ట్రిప్ ఏదో పూర్తి చేసుకుని వచ్చి సంక్రాంతి కల్లా అయినా సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా చేస్తాడేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ఆశలను ఈసారైనా నెరవేరుస్తాడో లేదో చూడాలి మరి.

Leave a Reply