Posted [relativedate]
మాస్ మహారాజా రవితేజ బెంగాల్ టైగర్ సినిమా చేసి ఏడాది పూర్తైనా ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా ట్రాక్ లో పెట్టలేకపోయాడని, రవితేజకు ఏదో జరిగిందంటూ రకరకాల వార్తలు ఫిల్మ్ నగర్ తో పాటు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఇటువంటి వార్తలకు చెక్ పెడుతూ రవితేజ టచ్ చేసి చూడు అంటూ సమాధానమిచ్చాడు.
అదేనండీ టచ్ చేసి చూడు అనేది రవితేజ చేయబోయే సినిమా పేరు.ఈ సినిమా ద్వారా విక్రమ్ సిరికొండ అనే నూతన దర్శకుడ్ని పరిచయం చేస్తున్నాడు మాస్ మహారాజా. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి మొదటివారంలో షూటింగ్ మొదలు పెడుతున్నట్లు తెలిపింది. వక్కంతం వంశీ కధ అందించిన ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు నటిస్తుండగా ఒక హీరోయిన్ గా రాశిఖన్నాను సెలెక్ట్ చేశామని దర్శకుడు తెలిపాడు.