‘అదుగో’ అంటున్న రవిబాబు..

0
571

ravi pandi1

డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు ర‌విబాబు పందిపిల్ల సెంట్రిక్ గా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.  పందిపిల్లపై సినిమా చేయడం తొలిసారి కావడంతో ఈ విషయం తెలియగానే ఇండస్ట్రీలో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ప్రముఖ నిర్మాత నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సపోర్ట్ తో ఇలాంటి విలక్షణ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి రవిబాబు సిద్ధమయ్యారు. డి.సురేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రానున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రానికి `అదుగో` అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకు ఎవరూ తెరకెక్కించని డిఫరెంట్ స్క్రిప్ట్ తో సినిమా రూపొందించడంలో ఎదురైన అనేక సవాళ్ళను దాటి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త నటీనటులు అభిషేక్, నాభ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల గురించి వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు తెలియజేశారు. 

Leave a Reply