మరోసారి గోవిందుడు సీన్‌ను రిపీట్‌ చేసిన చరణ్‌

0
536
ravu ramesh out prakash raj in in ram charan and sukumar movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ravu ramesh out prakash raj in in ram charan and sukumar movie
క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా బండ్ల గణేష్‌ నిర్మించిన చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే’. ఆ సినిమాలో చరణ్‌కు తాత పాత్రలో మొదట ఒక తమిళ నటుడిని అనుకున్నారు. సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు పూర్తి చేశారు. అంతా బాగుందని భావిస్తున్న సమయంలో ఆ తమిళ నటుడు చరణ్‌ పాత్రను డామినేట్‌ చేస్తున్నాడని, ఇలా అయితే సినిమా ఫలితం దెబ్బ కొట్టే అవకాశం ఉందని స్వయంగా చిరంజీవి ఆ తమిళ నటుడు స్థానంలో ప్రకాష్‌ రాజ్‌ను ఎంపిక చేసి, పాత్ర పరిధిని కాస్త తగ్గించి మళ్లీ రీ షూట్‌ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు సుకుమార్‌ దర్శకత్వంలో చరణ్‌ చేస్తున్న సినిమాకు కూడా అదే పరిస్థితి రిపీట్‌ అయ్యింది.

సుకుమార్‌ దర్శకత్వంలో చరణ్‌ నటిస్తున్న సినిమాలో ఒక కీకమైన పాత్రకు ప్రముఖ నటుడు రావు రమేష్‌ను ఎంపిక చేయడం జరిగింది. రావు రమేష్‌తో పలు సీన్స్‌ కూడా చిత్రీకరించారు. ఒక షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు రావు రమేష్‌ను తప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. కారణాలు తెలియరాలేదు కాని, చరణ్‌ మూవీ నుండి రావు రమేష్‌ను తొలగించి, ఆ స్థానంలో ప్రకాష్‌ రాజ్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో జరుగబోతున్న షెడ్యూల్‌లో మళ్లీ కొన్ని సీన్స్‌ను ప్రకాష్‌ రాజ్‌తో రీ షూట్‌ చేయబోతున్నారు. సినిమా షూటింగ్‌ సందర్బంగా రావు రమేష్‌, సమంతలు పంచె కట్టుకుని దిగిన ఒక ఫొటో ఆ మద్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెల్సిందే. రావు రమేష్‌ను తప్పించడంతో ఈసారి ప్రకాష్‌ రాజ్‌తో సమంత పంచె కట్టుకొని సందడి చేస్తుందేమో.

Leave a Reply