Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటిదాకా పల్లకి మోతకే అలవాటుపడ్డ పవన్ కు ఈగల మోత షురూ అయింది. రాయలసీమ నుంచి పోటీ చేస్తానన్న జనసేన అధినేతపై రాయలసీమ సాధన సమితి నేతలు ఫైరయ్యారు. అసలు నీకూ రాయలసీమకూ సంబంధమేంటని నిలదీయడంతో.. పవన్ అవాక్కవుతున్నారు.
సీమకు ఏమీ చేయని పవన్, రాజకీయ మనుగడ కోసం అనంత నుంచి పోటీచేస్తే మేం ఒప్పుకోం అంటున్నారు సాధన సమితి నేతలు. దీంతో జనసేన పార్టీ కిందా మీదా పడుతోంది. ఇప్పటికి సరే కానీ, రేపు నిజంగా పవన్ పోటీచేసేటప్పుడు గొడవ మొదలైతే.. భంగపాటు తప్పదని భయపడుతున్నారు.
చిరంజీవి పాలకొల్లు ఎపిసోడ్ పవన్ కు గుర్తొస్తోందని సన్నిహితులు చెబుతున్నారు. ఎందుకైనా మంచిదని మరో ఆప్షన్ కూడా రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఎలాంటి వ్యూహం లేకుండా ఏది తోస్తే అది చేస్తున్న పవన్ వల్ల తమకు పెద్దగా ఉపయోగం ఉండదని అనంత జనం కూడా భావిస్తున్నారట. దీంతో జనసేన పార్టీకి ఎన్నికలకు ముందే చిక్కొచ్చిపడింది.