ఆర్ బీ ఐ ఇక స్వతంత్రం…

0
602

independence-of-rbi-gov1

దేశంలోని ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాలన్నా, బ్యాంకుల మొండి బకాయిలు రాబట్టాలన్నా రిజర్వుబ్యాంకుకు స్వతంత్రప్రతిపత్తి కల్పించాలని ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంకుకు స్వతంత్ర విధివిధానాలుండాలన్నారు. దీనికితోడు ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికరంగంలో సంభవిస్తున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుని, సెంట్రల్ బ్యాంకుల స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నారు. అదేవిధంగా స్థిరమైన అభివృద్ధి అవసరమన్నారు.

ద్రవ్యోల్బణాన్ని తగ్గించి వినియోగితా ధరలను అదుపులో ఉంచడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధిపై ఆర్‌బిఐ యోచిస్తుంది కానీ ఆర్‌బిఐ తీరుపై వచ్చే విమర్శలు, హఠాత్తుగా తగ్గే చమురు ధరల విషయంలో ఏమీ చేయలేదన్నారు. తాను ద్రవ్యోల్బణాన్ని అదుపుల ఉంచేందుకే తాను ఆర్‌బిఐ వడ్డీ రేట్లలో మార్పులు తీసుకువచ్చానన్నారు. ఆర్‌బిఐ పాలసీ రేట్లను జనవరి 2015 నుండి ఈ యేడాది ఏప్రిల్ వరకూ 150 బేసిక్ పాయింట్లకు తీసుకువచ్చింది.

అయితే ఇదే సమయంలో కన్స్యూమర్ ద్రవ్యోల్బణం గత జూన్ నాటికి రెండు సంవత్సరాల గరిష్టానికి అంటే 5.77 శాతానికి చేరుకుంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి ఆర్‌బిఐ 2 నుండి 6 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యంగా నిర్ణయించింది. అధికస్థాయి ద్రవ్యోల్బణంతోపాటు మరికొన్ని కారకాలు దేశంలోని ఆర్థిక పరిస్థితులు దిగజారడానికి కారణమయ్యాయన్నారు. కాగా ఆగస్టు 9 జరగబోయే ఆర్‌బిఐ సమీక్షా సమావేశంలో రాజన్ మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశముంది.

Leave a Reply