500,1000 వద్దంటుంటే 2000?

 Posted October 24, 2016

rbi issue 2000 rupees india currency notes
నల్లధనానికి చెక్ పెట్టాలంటే 500,1000 రూపాయల నోట్లు నిషేదించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తూనే వున్నారు.ప్రధాని మోడీకి ఇటీవల లేఖ కూడా రాశారు.మోడీ కూడా నల్లధన ప్రకటనకు వచ్చిన స్పందన చూసి..బయటపడ్డ డబ్బుని చూసి నిజంగా తీవ్ర స్థాయిలో దాడులు జరిపితే ఎంత సంపద వెలుగుచూసేదో కదా అని వ్యాఖ్యానించడం అయన అంతరంగానికి అద్దం పడుతోంది.నల్లధనం వెలికితీతకు మరో గట్టి ప్రయత్నం చేయాలని మోడీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో 2000 రూపాయల నోట్లు ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.అయినా ఆర్బీఐ కారణాలు ఆర్బీఐ కి వున్నాయి. పెరుగుతున్న ధరల దృష్ట్యా అధిక విలువున్న నోట్లకి డిమాండ్ వుంది.RBI తాజా గణాంకాల ప్రకారం 2016 నాటికి 16,41,500 కోట్ల కరెన్సీ నోట్లు దేశమంతటా చెలామణిలో వున్నాయి.ఇందులో 86.4 % నోట్లు 500,1000 రూపాయలవే.ప్రస్తుతం వెయ్యి నోటు ముద్రణకి అవుతున్న ఖర్చు త్రీ రూపాయలు.అదే వ్యయంతో భిన్న డినామినేషన్ ఉన్న నోట్ల తయారీ వల్ల కరెన్సీ డిమాండ్ తట్టుకోగలమని RBI భావన.ఇప్పటికే 2000 నోటు విడుదలకి RBI కసరత్తు పూర్తి అయ్యింది.మైసూర్ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రణ కూడా పూర్తి అయింది.కరెన్సీ చెస్ట్ లకి పంపిణీ జరుగుతోంది.త్వరలో 2000 నోటు జనం చేతుల్లోకి రావడం ఖాయం.నల్లధనం దాచుకునే వారికి మరింత సౌలభ్యం.ఈ భిన్నమైన సవాల్ ని మోడీ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

SHARE