సి ఎం కెసిఆర్ కి హ్యాండిచ్చిన ఆర్ బీ ఐ

Posted November 30, 2016, 7:52 pm

Related image

తెలంగాణ సి ఎం కెసిఆర్ కు ఆర్ బీ ఐ హ్యాండిచ్చింది. ఉద్యోగుల వేతనాలను చెల్లించేందుకు 500 కోట్లు నగదు కావాలని అడిగినా బ్యాంకు నుంచి సానుకూలత రాలేదు .ఇదిలా ఉండగా నవంబరు నెల వేతనాల్లో 10 వేల రూపాయలను నగదు రూపంలో ఇవ్వాలని ఉద్యోగులు కోరుతుండగా సారీ క్యాష్ లేనందున అలా ఇవ్వలేమని బ్యాంకు స్పష్టం చేసింది. తమవద్ద తగినంత నగదు లేదని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తీర్చలేమని చల్లగా చెప్పేసింది. దీంతో సుమారు మూడున్నర లక్షలమంది ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. కాగా దీనిపై భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. సామాన్య ప్రజలు తమ డబ్బుల కోసం బ్యాంకులు, ఏ టీ ఎం ల ముందు పెద్ద క్యూలలో నిలబడలేక అవస్థలు పడుతుంటే ప్రభుత్వం ఇలా ప్రయారిటీ లు ఇవ్వడం సమంజసం కాదని కొందరు అంటు న్నారు. అయితే మరి కొందరు మాత్రం ఉద్యో గుల డిమాండ్ సహేతుక మేనని అభిప్రాయ పడు తున్నారు..