గుంటూరు రియల్ ఎస్టేట్ కి దిల్ రాజు ఊపు?

0

Posted [relativedate]

dil raju singer mano build new multiplex in guntur inner ring road
గుంటూరు …రియల్ ఎస్టేట్ …దిల్ రాజు…ఇలా ఒకదానికి ఒకటి పొంతన లేని విషయాల్ని కలిపి చెప్పేస్తున్నారు అనుకుంటున్నారా? అదేమీ లేదు ..పై హెడ్డింగ్ లో విషయంలోఎలాంటి సందేహం అక్కర్లేదంట.ఇది గుంటూరు కేంద్రంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం.ఆకాశాన్ని అంటిన ధరలు,అంతంత మాత్రంగా రాజధాని నిర్మాణపు పనులు,పెద్ద నోట్ల రద్దు ఇలా వరుస కారణాలతో గుంటూరు లో రియల్ ఎస్టేట్ రంగం కొన్నాళ్లుగా పడకేసింది.ఒకటి రెండు చోట్ల మాత్రం పరిస్థితి కొంత నయం.అందులో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతం ఒకటి. అక్కడ మాత్రమే అపార్ట్ మెంట్ ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది.అమ్మకాల కోసం అక్కడి రియల్ ఏజెంట్స్ అంతా దిల్ రాజు జపం చేస్తున్నారు.

రియల్ ఏజెంట్స్ అలా చెప్పడానికి కారణం ఏమిటంటే …గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో నిర్మాత దిల్ రాజు,సింగర్ మనో కలిసి ఓ భారీ మల్టిప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారని ఏజెంట్స్ చెబుతున్నారు.ఇప్పటికే రెస్టారెంట్స్ వచ్చిన ఆ ప్రాంతానికి దిల్ రాజు వస్తున్నాడన్న వార్త కొనుగోలుదారుల్లో ఆసక్తి రేపుతోంది.అమ్మకాలపై దాని ప్రభావం కనిపిస్తోందని కూడా ఏజెంట్స్ చెబుతున్నారు.మొత్తానికి డల్ గా ఉన్న గుంటూరు రియల్ ఎస్టేట్ రంగానికి దిల్ రాజు పేరు ఎంతోకొంత ఊపు ఇస్తుందన్నమాట.

పదునెక్కుతున్న రియల్ ఎస్టేట్ చట్టం..

real estate law
లే అవుట్‌ వేయాలన్నా.. కొత్తగా ప్లాట్లు డెవలప్‌ చేయాలన్నా.. ఇక నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సైతం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో రియల్‌ ఎస్టేట్‌ చట్టం 2016 తీసుకురానుంది. ఈమేరకు చట్టం ముసాయిదాను అన్ని రాష్ట్రాలకూ పంపింది. ఈ ముసాయిదాపై ఆగస్టు15, 2016 లోగా చట్టం ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వ సలహాలు, సూచనలు పంపాల్సిందిగా కేంద్రం కోరింది. కేంద్రప్రభుత్వం నియమించిన సలహా మండలి పలు సిఫార్సులతో ముసాయిదాను సిద్ధం చేసి వాటిపై వ్యాపారవేత్తలు, నిపుణులు, సివిల్‌ సొసైటీ సభ్యుల సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది.

వాటి పరిశీలన అనంతరం ముసాయిదాలో పొందు పరిచి కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. వాటితో పాటు కేంద్రం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను క్రోడీకరించి అక్టోబర్‌ 31, 2016 నాటికి కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పట్టణాభివృద్ధి సంస్థ లను ముసాయిదాపై అభిప్రాయాలను తెలపాల్సింది గా మున్సిపల్‌ శాఖ కోరింది. ఈ చట్టం ప్రకారం ఏదైనా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవా లంటే సదరు రియల్టర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుం ది. పర్యవేక్షణ, వివాదాలకు అథారిటీ, ట్రిబ్యునల్‌ ఆర్థిక, వాణిజ్య, అకౌంటెన్సీ, రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగానికి సంబంధించిన నిపుణులతో కేంద్రం రియల్‌ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీని నియమిస్తుంది.

రియల్టర్లు అప్‌లోడ్‌ చేసే పత్రాలు, చెల్లించే రిజిస్ట్రేషన్‌ ఫీజులు, పెనాల్టీలు తదితర లావాదేవీలు అథారిటీ పర్యవేక్షిస్తుంది. ఈ అథారిటీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌గా కూడా వ్యవహరిస్తుంది. రియల్‌ వివాదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వివాదంలో ఉన్న రియల్‌ ప్రాజెక్టు సమస్యను స్థానిక సివిల్‌ కోర్టు ద్వారా సత్వర పరిష్కారానికి కృషి చేస్తుంది. న్యాయ నిర్ణయాధికారి ఆదేశాలను అమలు చేస్తుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులకు ప్రతిపాదిత భూమి వెయ్యి చదరపు గజాలలోపు ఉంటే.. చదరపు మీటరుకు రూ పది, వెయ్యి చమీ మించి ఉంటే.. చమీ కు రూ ఇరవై రిజిస్ట్రేషన్‌ ఫీజుగా నిర్ణయించబడింది. వెయ్యి చమీ వాణిజ్య సముదాయానికైతే.. చమీ రూ యాభై, వెయ్యి చ.మీ మించి ఉంటే.. రూ వంద రిజిస్ట్రేషన్‌ ఫీజు నిర్ణయించబడింది.

సదరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకోవాలనుకుంటే గడువు నిర్ణయించబడిన 30 రోజుల్లోగా చేసుకోవచ్చు. రద్దు చేసుకున్న 30 రోజుల్లోగా ప్రాసెసింగ్‌ ఫీజుకు చెల్లించిన పది శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు ( రూ యాభైవేలు ) 30 రోజుల్లోగా తిరిగివ్వబడుతుంది. రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసేటప్పుడు డెవలప్‌ చేయాలనుకునే నివాస స్థలం లేదా అపార్ట్‌మెంట్‌ కు సంబంధించిన వివరాలు, నిర్మాణ స్థలం తదితర వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. డెవలప్‌ చేసే ప్లాట్ల విషయంలో.. ప్లాట్లను విక్రయించిన, కేటాయించిన వారి వివరాలను తెలపాలి. రిజస్ట్రేషన్‌ ఆమోదించినదీ.. తిరస్కరించిదీ.. విడిగా రెగ్యులేటరీ అథారిటీ తెలియజేస్తుంది. రిజిస్ట్రేషన్‌ దరఖాస్తును ఆమోదించిన మూడు నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలి.

అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం రిజిస్ట్రేషన్‌ గడువు పెంచుకునే అవకాశముంది.డెవలపర్‌ గ్రూపునకు సంబంధించిన అడ్రెస్‌, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ వంటి వివరాలు, రియలెస్టేట్‌ గ్రూపు నెలకొల్పిన వివరాలు, ఏదైనా రియలెస్టేట్‌ ప్రాజెక్టుతో గతంలో లిటిగేషన్‌ ఉంటే వాటి వివరాలు, రియలెస్టేట్‌ గ్రూపుకు సంబంధించిన వెబ్‌సైట్‌, డెవలప్‌మెంట్‌ చేసే అపార్ట్‌మెంట్‌కు కేటాయించిన స్థలం, పార్కింగ్‌ ఏరియా తదితర వివరాలు, ప్రాజెక్టు చేపడుతున్న ఏరియా, డెవలప్‌మెంట్‌ ప్లాన్‌, ప్రాజెక్టు అప్రూవల్‌ స్టేటస్‌, స్థలం , లేఅవుట్‌ ప్లాన్‌కు సంబంధించిన ధృవీకరణ పత్రాలు, లైసెన్స్‌ , తదితర అనుమతి పత్రాలను రిజిస్ట్రేషన్‌ కోసం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.