Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి వెనుక కారణం తెలిసింది.అపోలో వైద్యులు నిషిత్ మరణానికి సంబంధించి ఓ మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు.అపోలో ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుడు సురేందర్ రెడ్డి చెప్తున్నదాని ప్రకారం కారు అతివేగంతో పిల్లర్ ని ఢీకొట్టడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా వుంది.ప్రమాదం జరిగిన పదినిమిషాల్లోనే ఆ ఇద్దరూ చనిపోయివుంటారు.నిషిత్,రవి వర్మ మద్యం సేవించలేదు.బలమైన దెబ్బల వల్లే చనిపోయారు.డ్రైవింగ్ సీట్లో కూర్చున్న నిషిత్ ఛాతీకి స్టీరింగ్ బలంగా గుద్దుకోవడంతో ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయి.లివర్ కూడా ముక్కలుముక్కలు అయ్యింది.ఈ కారణాల తోనే నిషిత్ మరణం సంభవించినట్టు అపోలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం నిర్దారించింది.3