Posted [relativedate]
సహజనటి జయసుధ భర్త నితిన్ కపూర్ నిన్న మధ్యహ్నం1.45కి ఓ అపార్ట్ మెంట్ టెర్రైస్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నితిన్ కపూర్ కి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా నిర్మాతగా మంచి గుర్తింపు ఉంది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడం వెనుక పరోక్షంగా ఈ సినిమాలే కారణం అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
ముంబైలోని తన సోదరి అపార్ట్ మెంట్ ని నితిన్ కపూర్ తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. అపార్ట్ మెంట్ పైన ఉన్న టెర్రైస్ డోర్ కి వేసిన తాళాన్ని పగులగొట్టి మరీ అక్కడి నుంచి దూకి నితిన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. సినిమాల్లో సరైన విజయాలు లేకపోవడంతో ఆయన కుంగిపోయారని సమాచారం. ఆ డిప్రెషన్ నుండి బయటపడేందుకు ఇటీవల ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారట. కాగా ఈ డిప్రెషన్ సమయంలోనే కుమారుడు శ్రేయాన్ తో నిర్మించిన బస్తీ చిత్రం కూడా నష్టాలను మిగల్చడంతో మరింత ఆర్ధిక సమస్యలు ఆయన్ని చుట్టుముట్టాయట. దీంతో ఆయన సూసైడ్ చేసుకుని ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషాదం చోటుచేసుకొన్నప్పుడు ఆయన కుమారులు ముంబైలోనే ఉన్నారు. అయితే వీరు ఇంటివద్ద లేని సమయంలో నితిన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.