ఇటీవలే హరిత పన్ను,కొవ్వు పన్ను అంటూ వెరైటీ ప్రతిపాదనలు తెచ్చిన కేరళ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకొంది .హార్వార్డ్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న గీతా గోపినాథ్‌ను ప్రభుత్వ ఆర్ధిక సలహాదారుగా నియమించింది .ముఖ్యమంత్రి విజయన్ నిర్ణయంపై ఓ వైపు విమర్శలు ,మరోవైపు ప్రశంసలు కురుస్తున్నాయి .ఆమె రాష్ట్ర ఆహ్వానాన్ని మన్నించడం ప్రజలు చేసుకున్న అదృష్టంగా సీఎం అభివర్ణిస్తున్నారు .కేరళ మూలాలున్న గీత కొత్త పాత్రలోఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తిదాయకం .హార్వర్డులో సంస్కరణలకు అనుకూల పాఠాలు చెప్పిన ఆమె ఇక్కడ ఏ సలహాలిస్తారు? ఆ సలహాల్ని కమ్యూనిస్టు ప్రభుత్వం అమలు చేస్తుందా?
కేరళ ఆర్ధికవ్యవస్థను గాడిలోపెట్టడానికి విజయన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఉదారవాద విధానాలకు మొగ్గు చూపుతున్నట్టున్నాయి.ఇప్పుడు కేరళ ఒక్కటే దేశంలోఎర్రజెండా పాలనలో వున్న పెద్ద రాష్ట్రం.అక్కడ ప్రభుత్వ విధానాలను కేవలం ఓ రాష్ట్రవ్యవహారం గానే భావించలేము .అంటే ఎర్రజెండా చాప కింద నీరులా సంస్కరణలకు తెల్లజెండా ఊపిందా?