రెడ్డి,కమ్మ వల్ల ఇండియన్స్ ఫూల్స్ అయ్యారా?

Posted April 14, 2017

reddys and kammas made indians fools
జస్టిస్ కట్టూ…వివాదాస్పద వ్యాఖ్యలు,చేదు నిజాలు చెప్పడంలో ఏ మాత్రం మొహమాటపడరు. ఒకప్పుడు దాదాపు 90 శాతం భారతీయులు ఫూల్స్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.ఆ వ్యాఖ్యలు నిజమేనని నిరూపించుకోడానికి ఆయన భలే ఉదాహరణ కోట్ చేశారు.అందులో ఆంధ్రప్రదేశ్ కి చెందిన రెండు ప్రధాన కులాలు రెడ్డి,కమ్మ భాగమయ్యాయి.అదెలాగంటే …

“అమెరికాలో కుల తత్వం” అనే శీర్షికతో జస్టిస్ కట్టూ సోషల్ మీడియా లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడు ఒకరు చెప్పిన విషయాన్నే ఈ పోస్ట్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు.”కాలిఫోర్నియా లోని ఫ్రీమాంట్ ప్రాంతంలో ఓ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో రెండు టీమ్స్ విభజన కులాల వారీగా జరిగింది.ఒకటి రెడ్ల టీం,ఇంకోటి కమ్మోళ్ల టీం .

ఈ మ్యాచ్ మధ్యలో ఓ చిన్న గొడవ మొదలై చివరికి ఆట ఆపేసారు.అసలు కాలిఫోర్నియా లో కులాల వారీగా టీమ్స్ ఏంటి ?అక్కడ కులాలవారీగా గొడవ పడడం ఏంటి ? భారత దేశం కుల వ్యవస్థ ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి ఇది చాలు.13500 కిలోమీటర్లు ప్రయాణించి,బాగా అభివృద్ధి చెందిన దేశం వెళ్లి కూడా కులాన్ని మోస్తూనే వున్నారు.దీన్ని చూస్తే 90 శాతం ఇండియన్స్ ఫూల్స్ అని నేను చెప్పింది నిజం అనిపించడం లేదా ?” అన్న కట్టూ ప్రశ్న కాస్త కటువుగా ఉండి ఉండొచ్చు.కానీ నిజాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి.అధికారమే పరమావధిగా కొందరు ఆడుతున్న నాటకంలో పావులుగా మారి కుల ఊబిలో చిక్కుకుంటే కట్టూ చెప్పినట్టు ఫూల్స్ అవ్వడం ఖాయం.ఆ జాబితాలో చేరాలనుకునే వాళ్ళని ఎవరు ఆపగలరు?

SHARE