Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘మిర్చి’ చిత్రంలో అనుష్క కాకుండా మరో హీరోయిన్ నటించింది గుర్తుంది కదా, అదేనండి రిచా గంగోపాద్యాయ. ‘మిరపకాయ్’ చిత్రంలో రవితేజతో రొమాన్స్ చేసి ఆకట్టుకున్న ముద్దుగుమ్మ గత కొంత కాలంగా కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. ఎవరైనా సినిమాల్లో అవకాశాలు వస్తే చదువును వదిలేస్తారు. కాని మంచి అవకాశాలు వస్తున్నా కూడా ఈ అమ్మడు అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు అంటూ వెళ్లింది. సినిమాలకు గత మూడు సంవత్సరాలుగా దూరంగా ఉంటూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఎంబీఏలో పట్టాను పొందింది.
తన కల సాకారం అయ్యిందని, అనుకున్నది సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, మళ్లీ తాను సినిమాల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. తెలుగు లేదా తమిళంలో ఈమె నటించేందుకు ఆసక్తి చూపుతుంది. సినిమాలకు దూరం అయిన మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ అవకాశాలు కావాలి అంటే అంత సులభంగా రావడం సాధ్యం కాదు. రిచా గంగోపాద్యాయ తన కెరీర్ను మళ్లీ మొదటి నుండి మొదలు పెట్టాల్సి ఉంటుంది. చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న ఈ అమ్మడికి అవకాశాలు ఎవరైనా ఇస్తారేమో చూడాలి. చిన్నా చితకా హీరోల సరసన చిన్న సినిమాల్లో ఛాన్స్ వస్తే రావచ్చు గాక, కాని స్టార్ హీరోలకు జోడీగా ఈ అమ్మడికి నటించే అవకాశాలు రావడం దాదాపు అసాధ్యంగా చెబుతున్నారు.