మహేష్, చరణ్ మాయలో రెజినా..!

0
333

Posted [relativedate]

rjj-2స్టార్ హీరోయిన్ అవ్వాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందరికి లక్ కలిసి రాదు.. అయితే తనతో పాటుగా కెరియర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ వరుసెంట స్టార్స్ తో నటిస్తుంటే తను మాత్రం ఎందుకు వెనుకపడ్డదని ఆలోచిస్తుంది రెజినా. అందుకే స్టార్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంది. ఇక లాభం లేదు అనుకుందో ఏమో స్టార్స్ మీద హాట్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టింది.

తనకు ఇష్టమైన ఇద్దరు సెక్సియెస్ట్ హీరోలుగా మహేష్, రాం చరణ్ పేర్లను ఎనౌన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అంటే ఎలాగు అవకాశాలు రావట్లేదు సరికదా అని వారిని తన మాయలో పడేయాలని చూస్తుంది. ఇప్పటికైతే రెజినా కుర్ర హీరోలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మరి ఇప్పుడిప్పుడే కాస్త స్కిన్ షోకి సై అంటున్న ఈ భామ త్వరలోనే స్టార్స్ తో కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగుతో పాటుగా తమిళ మార్కెట్ మీద కన్నేసిన ఈ చిన్నది. అక్కడ వరుసెంట సినిమాల్లో నటిస్తుంది. తెలుగు సినిమాలే తనకు ఇంతటి క్రేజ్ తెచ్చాయని చెబుతున్న రెజినా కలలు కంటున్న స్టార్ ఇమేజ్ ఎప్పుడు అందుకుంటుందో చూడాలి.

Leave a Reply