ప్రాంతీయ పార్టీలకు మోడీ షాక్.?

 regional parties modi shock one time election process

దేశ రాజకీయ చిత్రంలో ప్రాంతీయ శక్తుల ప్రాభవానికి గండి పడుతుందా.? ప్రాంతీయ పార్టీల హవా తగ్గించడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారా.? ఔను.. ఇది నిజమే.. కానీ మోడీ ఆ ప్రయత్నాలు పరోక్షంగా మాత్రమే చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే వ్యయ నియంత్రణ,నిరంతర రాజకీయ సంఘర్షణ నివారించవచ్చని మోడీ భావిస్తున్నారు. ఆయన ఇదే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఎన్నికల సంఘం కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల విధానానికి అనుకూలంగా మాట్లాడారు. దీనివల్ల ప్రాంతీయ శక్తులకు ప్రమాదం తప్పదా?.

సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ వాతావరణం కేంద్ర ప్రభుత్వం, జాతీయ పార్టీల దృక్కోణంలో సాగుతుంది. సహజంగానే ఈ పరిణామం బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు అనుకూలంగా … ప్రాంతీయ శక్తులకు ప్రతికూలంగా మారుతుంది. ముఖ్యంగా రెండు ప్రధాన జాతీయ పార్టీలకు దూరంగా వుండే శక్తులకు ఇది తీరని కష్టం కలిగించే పరిస్థితులు రావచ్చు. 2009 ఎన్నికల సమయంలో అప్పటి వైస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా వున్నప్పటికీ కాంగ్రెస్ ముద్ర మళ్ళీ విజయానికి బాటలు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 156 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ … 33 ఎంపీ స్థానాల్ని గెలుచుకుంది. 92 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ కేవలం 6 లోకసభ స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అదే సార్వత్రిక ఎన్నికల మహత్యం. ఇపుడు మోడీ ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రాంతీయ శక్తులు దెబ్బతినడం ఖాయం.

SHARE