రెజీనా టాలెంట్ చూసే ఛాన్స్ ..

 rejina aanken2 bollywood movie chance ఇప్పుడందరి కళ్లూ టాలీవుడ్ సుందరి రెజీనా పైనే ఉన్నాయి. బాలీవుడ్‌లో ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో ‘ఆంఖే 2’లో అవకాశం రావడంతోనే అందరి దృష్టీ రెజీనాపైనే ఉంది.

అసలు హిందీ సినిమా గరించి కలలో కూడా ఊహించలేదట ఆమె. ఇంతకీ రెజీనాకి ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందంటే.. చిత్రదర్శకుడు అనీస్ బజ్మీ సౌత్‌లో రెజీనా చేసిన సినిమాలు చూసి, ‘ఆంఖే 2’కి సెలక్ట్ చేశారట. ఈ చిత్రంలో రెజీనా చాలా గ్లామరస్‌గా కనిపిస్తారట. ఇప్పటివరకూ హిందీ తెరపై కనిపించని ఓ హీరోయిన్‌ని కీలక పాత్రకు తీసుకోవాలనుకున్నారట అనీస్. ఈ క్రమంలోనే ఈ అవకాశం రెజీనాను వరించిందట.

‘ఆంఖే-2’లో కొత్తమ్మాయి పాత్రకు డ్యాన్సులు బాగా రావాలి. ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించాలి. రెజీనా గురించి తెలిసి, ఆమె చేసిన సినిమాలు చూశారట అనీస్. రెజీనా వెరీ టాలెంటెడ్ అని నిర్ధారించుకుని తన సినిమాకి తీసుకున్నానని చెప్తున్నారు అనీస్. తెలుగులో టాప్ హీరోయిన్స్‌ కూడా దక్కని అవకాశం రెజీనాకు దక్కడం ఆమె లక్ అనే చెప్పొచ్చు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే జనవరిలో ప్రారంభమవుతుంది.

SHARE