ఆ అమ్మడికి 90 ఏళ్ళు గుర్తుండే సినిమా…

0
527

   rejina jyo achyutananda movie remember 90 yearsసౌత్ సూపర్ బ్యూటీ రెజినా ఈ మధ్య జోరు పెంచిందనే చెప్పాలి. ఓ పక్క తెలుగు తమిళ భాషల్లో క్రేజీ సినిమాలు చేస్తున్న అమ్మడు ఇప్పుడు అంఖే-2తో బాలీవుడ్లో కూడా సత్తా చాటాలని చూస్తుంది. ఇక అమితాబ్, అనీల్ కపూర్ లాంటి సూపర్ స్టార్స్ తో నటించడం తన అదృష్టం అని చెబుతున్న రెజినా ప్రస్తుతం తెలుగులో రిలీజ్ కు రెడీ అవుతున్న జ్యో అచ్యుతానంద మీద చాలా నమ్మకంతో ఉంది. ట్రైలర్స్, సాంగ్స్ తో ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా కనిపిస్తున్న జ్యో అచ్యుతానంద మూవీ తన కెరియర్ లో ఓ తీపి జ్ఞాపకం లాంటి సినిమా అని చెప్పుకొచ్చింది.

అంతేకాదు 90 ఏళ్ల దాకా గుర్తుంచుకునే సినిమా ఇదని.. తన మనవలు మనవరాళ్లకు ఈ సినిమా చూపిస్తానని అంటుంది. అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మించారు. నాగ శౌర్య, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు. ఓ కొత్తరకం ఫీల్ తో న్యూ ట్రెండ్ క్రియేట్ చేయడానికి వస్తున్న ఈ జ్యో అచ్యుతానంద గురించి సిని లవర్స్ కూడా ఎంతో ఎగ్సైటింగ్ గా ఉన్నారు.. సినిమాలో డెంటల్ డాక్టర్ గా కనిపించనున్న రెజినా తన పాత్ర ప్రతి అమ్మాయికి నచ్చుతుందని అభిప్రాయపడ్డది. మరి ఇంత బిల్డప్ ఇస్తున్న ఈ అమ్మడు ఆ సినిమాతో ఏ రేంజ్ ఫలితం అందుకుంటుందో చూడాలి.

Leave a Reply