దేశమంతా రిలయన్స్ జియో మాయలో కొట్టుకెళుతోంది.ఫ్రీ కాల్స్,కారు చౌకగా డేటా …ఎక్కడ చూసినా ఇదే ప్రస్తావన.మీడియా ఈ ప్రచారం ఉద్ధృతి చేయక ముందు ముఖేష్ జియో ప్యాకేజీ వెల్లడించక ముందు ఓ పరిణామం జరిగింది.అదే పెట్రోల్ ధరలు పెరిగాయి.లీటర్ పెట్రోల్ కి మూడురూపాయల ముప్పై ఎనిమిది పైసలు,డీజిల్ కి రెండు రూపాయల అరవై ఏడు పైసలు పెరిగాయి.దీనికి కారణం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ కి 5 డాలర్లు పెరిగిందని చెప్తున్నారు.సరే అంతక ముందు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముడి చమురు ధర సగానికన్నా తక్కువకి పడిపోయినప్పుడు రేట్లు తగ్గకుంగా పెట్రోల్ పై పన్నులెందుకు పెరిగాయి?
ఇదంతా పాత చింతకాయ పచ్చడే.ఇది కేంద్రానికి తెలియక కాదు.తెలియనట్టు నటిస్తుందంతే.
ఇప్పుడు తాజాగా రిలయన్స్ జియో తో ఇచ్చే ఆఫర్ల వల్ల ఆ కంపెనీకి అయ్యే ఖర్చు 10 వేల కోట్లు అయితే,పెట్రోల్ ధరల పెంపుతో 50 వేల కోట్లు ఆదాయం రావచ్చని ఓ అంచనా.జనం,మీడియా ఆ విషయాన్ని వదిలేసి జియో లో మునిగితేలుతున్నారు.