రిలియన్స్ రాకతో తగ్గుతున్న నెట్ ధరలు…

   reliance jio internet  low costరిలయెన్స్ జియో దెబ్బకు విలవిల లాడుతున్నాయి. కస్టమర్లను కాపాడుకునేందుకు ఇటీవల ఎయిర్ టెల్, ఐడియా, ఎయిర్ సెల్ నెట్ వర్క్ లు డాటా, వాయిస్ కాల్, మెసేజ్ లను అతి తక్కువ ధరలో అందించడానికి ముందుకు వచ్చాయి.తాజాగా ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ అంటూ 4జీ, 3జీ రేట్లను 80 శాతం తగ్గించింది. రూ.51కే 1 జీబీ అందించేందుకు సిద్ధమయింది. అయితే దీనికి కండిషన్స్ అప్లై అన్నట్టు ప్రీపెయిడ్ వినియోగదారులు మొదట రూ. 1,498తో రీచార్జ్ చేసుకోవాలని మెలిక పెట్టింది. ఆ తర్వాత 1జీబీ 4జీ, 3జీ మొబైల్ ఇంటర్నెట్‌ను 28 రోజుల వరకు అందిస్తూ..

ఇక ఏడాది వరకు రూ 51 రూపాయలకే 1జీబీ డాటాను ఎన్నిసార్లైనా పొందవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ 28 రోజుల కాలపరిమితికిగాను 1జీబీ 4జీ, 3జీ మొబైల్ ఇంటర్నెట్ డాటాను రూ.259 వసూలు చేస్తోంది.అలాగే కంపెనీ ఆరు నెలల కాల వ్యవధి గల రూ.748తో మరో ఆఫర్‌ను కూడా ప్రకటించింది. దీంట్లో 1జీబీ 4జీ డాటాను రూ.99కే పొందవచ్చు అని తెలిపింది. ప్రస్తుతం ఈ ఆఫర్ ఢిల్లీలో అందుబాటులో ఉంది. ఈనెల 31నాటికి దేశంలోని అన్ని సర్కిళ్లలో ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ పేర్కొంది ఎయిర్ టెల్.

SHARE