షాకింగ్.. రేణూదేశాయ్ కి ఇంట్లోనే లింగవివక్ష

Posted [relativedate]

renu desai says about pawan kalyan in womens day interviewనిన్న మహిళా దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్  మాజీ భార్య.. రేణూ దేశాయ్ మీడియాకి స్పెషల్ ఇంటర్ వ్యూ ఇచ్చారు. డైలాగ్ విత్ ప్రేమ ఇంటర్వ్యూలో మాట్లాడిన  సందర్భంగా ఆమె కొన్ని షాకింగ్ విషయాలను చెప్పారు. తాను ఆడపిల్లగా పుట్టినందుకు తన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారని తెలిపింది. తాను డిస్క్రిమినేటెడ్ చైల్డ్ అని, తాను పుట్టినప్పుడు ఆడ పిల్ల అని తెలియడంతో ఆమె తండ్రి మూడు రోజుల వరకు ఆసుపత్రి ముఖం కూడా చూడలేదట. తన అక్క పుట్టిన తర్వాత తన పేరెంట్స్ అబ్బాయి కావాలనుకున్నారు. కానీ ఆడపిల్లగా తాను పుట్టడంలో అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారట. తనకు 15 ఏళ్ల వయసున్నపుడు ఈ విషయాన్ని తన తల్లి తనకు చెప్పింది అని రేణు దేశాయ్ తెలిపారు. దీంతో తాను ఇంట్లోనే చాలా వివక్షను  ఎదుర్కొన్నానన్నారు.

 “ నా తర్వాత తమ్ముడు పుట్టాడు. అబ్బాయి అంటే ఇంట్లో దేవుడుగా చూసే వారు. వాడు ఏదైనా తప్పు చేసినా ఏమీ అనేవారు కాదు, మేము ఏదైనా చేస్తే శిక్షించేవారు, ఇదేంటని అమ్మను అడిగితే లాగి కొట్టేది. ఈ పరిస్థితులు నాపై తీవ్రమైన ప్రభావం చూపింది. టీనేజ్ లో టామ్ బాయ్ ఉండేదాన్ని” అని తెలిపారు.

అలానే రెండో పెళ్లి గురించి తన అభిప్రాయం కూడా చెప్పుకొచ్చారు రేణూ.  “నేను పవన్ తనతో విడిపోయినా.. అతడిపై ప్రేమ ఉంది. అదెప్పుడూ అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను రెండో పెళ్లి చేసుకున్నంత మాత్రాన నాకు తోడు లభిస్తుందే తప్ప.. ఆ ప్రేమను పెళ్లి చేసుకున్న వ్యక్తికి పంచలేను కదా. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే వ్యక్తి నా పిల్లలకు సవతి తండ్రి అవుతాడే తప్ప తండ్రి కాలేడు కదా. రెండో పెళ్లి లేకుండా జీవించాలన్నదే నా భావన. సెకండ్ రిలేషన్ షిప్‌లో ప్రేమ అనేది కచ్చితంగా ఉండదు. మళ్లీ ప్రేమలో పడతానో లేదో తెలియదు.ప్రస్తుతం  ఒంటరి జీవితం మాత్రం నాకు  అలవాటైపోయింది. సరైన వ్యక్తి దొరికితే తానే తన రెండో పెళ్లి గురించి స్వయంగా చెబుతాను’’ అని రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply