రేణు దేశాయ్ చెబుతున్న పవన్ ముచ్చట్లు

0
617
renu desai shares pavan kalyan picture

pk11

పవన్, రేణు దేశాయ్ విడిపోయి ఉంటున్నా సరే పవన్ మీద తన అభిమానాన్ని చూపిస్తుంది రేణు దేశాయ్. పవన్ కు సంబందించిన ఏ విషయాన్నైనా ప్రస్థావిస్తూ వచ్చే రేణు తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా అందరి కంటే ముందుగానే స్పందించి ఓ పిక్ ను ట్విట్టర్ లో పెట్టింది. అంతేకాదు ఆ పిక్ ను డిపి గా పెట్టి పవన్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియచేయాలని కోరింది. ఇక రేణు పెట్టిన పిక్చర్ కూడా 2010 నాటిదని తెలుస్తుంది.

2010లో తాను కొన్న నికాన్ డి5తో తీసిన ఆ పిక్చర్ ట్విట్టర్ లో షేర్ చేసిన రేణు దేశాయ్ పవన్ గారి కళ్లలోని ఇంటెన్సిటీ బయటకు చెబుతున్న ఈ పిక్ తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. విడిపోయి ఎవరికి వారు ఉంటున్నా సరే పవన్ మీద రేణు, రేణు మీద పవన్ ఒకరిపై ఒకరు ప్రేమ బాగానే ఒలకపోస్తున్నారు. మరి రేణు చెప్పినట్టుగా ఈ పిక్ ఎంతమంది పవన్ ఫ్యాన్స్ డిపిగా పెట్టి సంచలనం సృష్టిస్తారో చూడాలి.

Leave a Reply